YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత.. పోలీసు వలయాన్ని ఛేదించిన అందోళనకారులు

ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత.. పోలీసు వలయాన్ని ఛేదించిన అందోళనకారులు

ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత.. పోలీసు వలయాన్ని ఛేదించిన అందోళనకారులు
హైదరాబాద్ 
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు ‘చలో ట్యాంక్ బండ్’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించనప్పటికీ భారీగా కార్మికులు ట్యాంక్ బండ్ చేరుకున్నారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ బారికేడ్ల పైనుంచి దూకి మరీ వెళ్లారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. దీంతో ట్యాంక్ బండ్ వైపు వచ్చే అన్ని రహదారులు మూసేశారు. మరోవైపు ట్యాంక్బండ్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
ఎక్కడికక్కడ అరెస్ట్లు : సెక్రటేరియట్ బస్టాప్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు ఓయూ జేఏసీ నేతలు ట్యాంక్ బండ్పై సొమ్మసిలి పడిపోయారు. ఆర్టీసీ క్రాస్రోడ్డు నుంచి తమ్మినేని వీరభద్రం, విమలక్క ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్రోడ్డులో పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ట్యాంక్ బండ్ వైపు నాయకులు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Related Posts