YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

పోలీసుల అదుపులో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

పోలీసుల అదుపులో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

పోలీసుల అదుపులో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
హైదరాబాద్ 
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు ‘చలో ట్యాంక్ బండ్’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించలేదు. దీంతో పోలీసులు శుక్రవారం నుంచే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశ్వత్థామతో పాటు పలువురు జేఏసీ నేతలను సైతం పీఎస్ కు తరలించారు. కాగా హైదరాబాద్ లో ఇప్పటి వరకూ 170 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ అంజనీకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నమే జేఏసీ కో-కన్వీనర్ కె.రాజిరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న వాహనంలో ఆయనను తరలించినట్లు కార్మిక నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ ను కూడా ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Related Posts