విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ
మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం, బూరుగుపల్లి గ్రామంలో రూ.1.60 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ శనివారం భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే కరెంటు ఉండదని విద్యుత్ వైర్ల పై బట్టలు ఆర వేసుకోవాలని గత పాలకులు ఎద్దేవా చేశారని అన్నారు. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బోర్ బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల శాతం ఎక్కువగా ఉండేదని గతంలో రాత్రి కరెంటు పగలు కరెంటు అని సమైక్య పాలకులు రైతులను అరిగోస పెట్టారని, అర్ధరాత్రుల్లు కరెంటు వస్తే బోరు వేయడానికి వెళ్లిన రైతులు ఎంతో మంది విద్యుత్ షాక్ కు గురై మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల కన్నీళ్లను తూడవలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.మొదటి నుంచే బాదేపల్లి మార్కెట్ కు మంచి పేరు ఉందని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే, జడ్చర్ల నియోజకవర్గం మొత్తం అణువణువు సస్యశ్యామలం అవుతుందని మార్కెట్ సామర్థ్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఎకరానికి రైతుకు ఐదు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్న ప్రభుత్వం తమదే అన్నారు. రైతు భీమ పథకం ద్వారా వారం రోజుల లోపే ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. బూరుగుపల్లి లో నిర్మించబోయే విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా బూరుగుపల్లి, పెద్దతాండ, సూది కుంట తండా, కిష్టంపల్లి, రంగయ్యకుంట తండా, నాగ సాల మరియు తదితర గ్రామాలకు మెరుగైన విద్యుత్తు సరఫరా అందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, బాద్మి శివకుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు