YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సుప్రీం తీర్పు వన్ సైడ్ గా ఉంది : ఒవైసీ

సుప్రీం తీర్పు వన్ సైడ్ గా ఉంది : ఒవైసీ

సుప్రీం తీర్పు వన్ సైడ్ గా ఉంది : ఒవైసీ
హైద్రాబాద్, 
అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు స్థల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు సంతృప్తి కలిగించలేదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం.. అయితే అదే సర్వోన్నతమైనది కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రోజు బాబ్రీ మసీదును కూల్చి ఉండకపోతే.. ఇవాళ ఎలాంటి తీర్పు వచ్చి ఉండేదని ఆయన ప్రశ్నించారు. అయితే.. భారత రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. తమ హక్కుల కోసం చివరిదాకా పోరాడతామని పేర్కొన్నారు.నిర్మాణానికి 5 ఎకరాల స్థలం దానంగా తమకు అక్కర్లేదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ‘మాపై సానుభూతి, అభిమానం చూపాల్సిన అవసరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. శనివారం (నవంబర్ 9) అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు కురిపించారు.బాబ్రీ మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారని అసదుద్దీన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఒక వర్గం వారికి మాత్రమే అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘అక్కడ బాబ్రీ మసీదు ఉందన్న విషయం శాస్త్రీయంగా తేలింది. సుప్రీం తీర్పు అసంపూర్తిగా ఉంది. ఈ విషయంలో ముస్లిం వర్గానికి అన్యాయం జరిగింది. దానంగా ఇచ్చే 5 ఎకరాల భూమి మాకు అక్కర్లేదు. ఆ ఐదెకరాల స్థలాన్ని కచ్చితంగా తిరస్కరించాల్సిందే. మా మీద సానుభూతి చూపాల్సిన అవసరం లేదు’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం శనివారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. రామజన్మ న్యాస్‌కే వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని కోర్టు పేర్కొంది. దీనికి ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించాలని.. దీనికి కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తర ప్రభుత్వం బాధ్యత వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Related Posts