బిగ్ బాస్ లో ట్యాంపరింగ్
హైద్రాబాద్,
బిగ్ బాస్ సీజన్ 3లో అనూహ్య పరిణామాలు, ఊహించని సంఘటనలతో రాహుల్ సప్లిగంజ్‌ను విజేతగా ప్రకటించారు. అయితే శ్రీముఖిని కాకుండా రాహుల్‌ని ప్రకటించడం వెనుక పెద్ద కథే నడిచిందని జనం వచ్చి ఎక్కడ తన్నుతారో అని ఈ నిర్ణయం తీసుకున్నారు అంటోంది యాంకర్ శ్వేతారెడ్డి.ఆమె మాట్లాడుతూ.. ‘మొదటి నుండి శ్రీముఖిని విన్నర్‌గా ప్రకటిస్తారని నాలాంటి వాళ్లు చాలా మంది చెప్పారు. శ్రీముఖినే ఎక్కువ ఫోకస్ చేసి చూపించడంతో ఆమె బిగ్ బాస్ విన్నర్ అని దాదాపు ఖాయం అయ్యింది. అయితే ఈ విషయంలో జనంలోకి బాగా వెళిపోవడంతో.. రాహుల్‌ని కనుక విన్నర్‌ని చేయకపోతే.. బిగ్ బాస్‌కి ఉన్న ఆ కాస్త పరువు కూడా పోతుందని డిసైడ్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీముఖి విన్నర్‌గా ప్రకటిస్తే.. నిజాలు జనాలకు తెలిసిపోతాయి.బయట రచ్చ రచ్చ అయిపోతుంది. కావాలనే ప్యాకేజ్‌లు ఇచ్చి బిగ్ బాస్ ఆటను ఆడించారని జనానికి తెలిసి పోతుందని రాహుల్‌ని గుడ్డిగా విన్నర్‌ని చేశారు. వాళ్లు ఎంత ఏడ్చుకుంటూ ఎంత తలబాదుకుంటూ రాహుల్‌ని విన్నర్‌గా చేశారో తెలియదు కాని.. ఈ నిర్ణయంతో జనంతో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ కూడా రియలిస్టిక్ జడ్జిమెంట్ అనుకోవచ్చు.ఎన్నికల్లో ఈవీఎంలు ఎలాఅయితే ట్యాంపర్ అయ్యాయో.. బిగ్ బాస్ ఓటింగ్ కూండా ట్యాంపర్ చేసే విధానం ఉంది. ప్రతిది వాళ్ల చేతుల్లోనే ఉంది. బిగ్ బాస్ ఆట మొత్తం స్క్రిప్టెడ్ మాదిరే ఓటింగ్ కూడా ట్యాంపర్డ్. చివరికి బిగ్ బాస్ వాళ్లు అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి. రాహుల్‌ని తప్పక విన్నర్ చేసి బోల్తా కొట్టారు. ఏదైతేనేం.. రాహుల్ మంచి సింగర్. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. బ్యాలెన్స్డ్‌గా గేమ్ ఆడాడు. కంగ్రాట్స్’ అంటూ బిగ్ బాస్ షో పై షాకింగ్ కామెంట్స్ చేసింది యాంకర్ శ్వేతారెడ్డి.