YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉగాది వేడుకలు

Highlights

  • 25న శ్రీరామనవమి ఉత్సవాలు 
  • టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌
తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉగాది వేడుకలు

తిరుపతి తిరుమల దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా మార్చి 18న ఉగాది, మార్చి 25న శ్రీరామనవమి వేడుకలను నిర్వహించతలపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
పంచాంగ శ్రవణం..
 ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం వినిపించడంతోపాటు ఉగాది పచ్చడి పంపిణీ చేస్తారు. మార్చి 25న శ్రీరామనవమి సందర్భంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి కాలనీల్లోని రామాలయాల్లో ఏడు రోజుల పాటు ప్రముఖ పండితులు '' శ్రీరామనవమి విశిష్టత, శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సీతా చరిత్ర, సేవాధర్మం, రామాయణం ఇంటింటి కథ, శ్రీరామరాజ్యం, రామాయణం జాతికి సందేశం'' అంశాలపై ధార్మికోపన్యాసాలు చేస్తారు. 

 వీటితోపాటు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన రామాలయాల్లో శ్రీరామనవమి పర్వదినాన్ని నిర్వహిస్తారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ ఎ.రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు
    ఓం..నమో...శ్రీవేంకటేశాయా!

Related Posts