శ్రీశైలంలో ఆర్జిత సేవలు, విఐపీ దర్శనాలు రద్దు
కర్నూలు
కర్నూలు జిల్లా శ్రీశైలంలో కార్తీక మాసం పురస్కరించుకొని వరుస సెలవులు, కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి వరుసగా రావడం వల్ల శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటుంన్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి రోజులలో గతంలో వలే ఆర్జిత సేవలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేస్తున్నట్లు, అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసి భక్తులందరికీ కూడా స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పించి ఈ నిర్ణయం వల్ల సర్వదర్శనం భక్తులు అధిక సమయం క్యూలైన్లలో వేచి ఉండకుండా ఉండేందుకు ముఖ్యంగా పూర్తి సంతృప్తికరంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు అవకాశం కలుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు తెలిపారు. అదేవిధంగా ఆలయ వేళల్లో మార్పులను చేశారు రేపు వేకువజామునే 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరచి 4 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.