Highlights
- మమతా బెనర్జీతో భేటీకి అవకాశం
జాతీయ స్థాయిలో కొత్త ఫ్రంట్ ఏర్పాటును వేగవంతం చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం కోల్ కతా కు వెళ్లనున్నారు. కూటమిని ఏర్పాటు చేస్తామని ప్రకటించాక కేసీఆర్ తొలిసారి ఈ పర్యటన చేపట్టారు. తృణమూల్ అధినేత్రి, సిఎం మమతా బెనర్జీని కలుస్తారు. ఆమెతో కొత్త ఫ్రంట్‌పై చర్చలు జరుపుతారు. కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే తొలుత మమత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడి అభినందించారు. ఈ నేపథ్యంలో తొలుత మమతను కలిసేందుకు కేసీఆర్ వెళ్తునున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ తలపోస్తున్నారు.