గోదావరి జలాలతో సూర్యాపేట చేరువులు
హైదరాబాద్ నవంబర్ 11
తీవ్ర నీటి ఎద్దడి ఉండే సూర్యాపేట జిల్లాలోని చెరువులను గోదావరి జలాలతో నింపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గత 20 రోజులుగా గోదావరి జలాలను సూర్యాపేట జిల్లా వరకు తరలిస్తున్నారు. నీటి ప్రవాహం ఎలా ఉంది? చెరువులు నింపుతున్నారా? ఇంకా ఎన్ని రోజులు నీటి విడుదల జరగాలి? అనే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆరా తీశారు. మంత్రి జగదీశ్ రెడ్డితో మాట్లాడారు. గోదావరి జలాలతో చెరువులు నింపుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నీటికి కొరత లేదని, ఎన్ని రోజులైనా గోదావరి జలాలు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సూర్యాపేట జిల్లాలో చెరువుల నింపాలని సిఎం చెప్పారు. చెరువులు నింపడానికి అనుగుణంగా కాల్వలకు అవసరమైన చోట మరమ్మతులు చేయాలని కోరారు.