YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి సిద్దిపేట

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి సిద్దిపేట

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
సిద్దిపేట నవంబర్ 11 
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ సమీపంలో సోమవారం వేకువజామున కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు చింతలపల్లి రామకృష్ణారెడ్డి (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పరువెళ్ళ గ్రామానికి చెందిన చంద్రారెడ్డి దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు కాగా ఏకైక కుమారుడైన రామకృష్ణారెడ్డి ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పోషణకు ఆధారంగా  ఉన్న కుమారుడు చనిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాదులో లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రామకృష్ణారెడ్డి ఓ కేసు విషయమై హైదరాబాద్ నుండి  హుస్నాబాద్ కోర్టుకు హాజరు కావడానికి తన బైక్ మీద వస్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రుల బంధువుల రోదనలు మిన్నంటాయి.

Related Posts