YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఫిర్యాదుల తక్షణమే పరిష్కరించండి -  ఎస్పీ అపూర్వ రావు

ఫిర్యాదుల తక్షణమే పరిష్కరించండి -  ఎస్పీ అపూర్వ రావు

ఫిర్యాదుల తక్షణమే పరిష్కరించండి
-  ఎస్పీ అపూర్వ రావు
వనపర్తి నవంబర్ 11 ,
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించి ఫిర్యాదు దారులకు న్యాయం చేకూర్చాలని జిల్లా ఎస్పీ అపూర్వ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఎనిమిది మంది ఫిర్యాదుదారులు విచ్చేసి వారి ఫిర్యాదులను ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాది దారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాలుగు భూ తగాదాలు, రెండు భార్యాభర్తల తగాదా, 2 ఇతర తగాదాల పై ఫిర్యాదు రాగా వెంటనే వాటిని పరిష్కరించి ఫిర్యాదు దారులకు న్యాయం చేకూర్చాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related Posts