YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి ఆరోగ్యం తెలంగాణ

నిలిచిపోయిన పౌరసేవలు.. ఇబ్బందుల్లో వృద్ధులు,వికలాంగులు రంగారెడ్డి

నిలిచిపోయిన పౌరసేవలు.. ఇబ్బందుల్లో వృద్ధులు,వికలాంగులు రంగారెడ్డి

నిలిచిపోయిన పౌరసేవలు..
ఇబ్బందుల్లో వృద్ధులు,వికలాంగులు
రంగారెడ్డి నవంబర్ 11 ,
సైదాబాద్  మండల రెవిన్యూ కార్యాలయంలో పౌరాసేవలు నిలిచిపోవటంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన నాటి నుండి రెవిన్యూ అధికారులు,సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో మూడు రోజులు విధులు బహిష్కరిస్తామని ప్రకటించిన రెవిన్యూ సంఘాలు వారం రోజులైనా విధులకు హాజరు కావటం లేదు.దాంతో చంపాపేట్ లోని సైదాబాద్ మండల కార్యాలయానికి గత నాలుగు రోజులుగా వివిధ పథకాల లబ్ధిదారులు వచ్చి అక్కడ సమాధానం చెప్పే దిక్కులేక మరలిపోతున్నారు. తహసీల్దార్ విజయారెడ్డి ఘటన నాటినుండి సైదాబాద్ మండల రెవిన్యూ కార్యాలయానికి సిబ్బంది తాళం వేసే ఉంచారు. సోమవారం ఈ కార్యాలయానికి పలువురు వృద్ధులు,వికలాంగులు వచ్చి తాళం వేసి ఉన్న కార్యాలయాన్ని చూసి హతాశులయినారు. రెండు నెలలుగా మాకు ఫించన్లు రావటం లేదని, ఆ విషయమై అడుగుదామని వ్యయప్రయాసలకు ఓర్చి ఇక్కడికి వస్తే సమాధానం చెప్పే నాధుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టరు,ఉన్నతాధికారులు స్పందించి మండల రెవిన్యూ కార్యాలయాలు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts