
డంపింగ్ యార్డ్, స్మశాన వాటికకు భూమి పూజ
ఆసిఫాబాద్ నవంబర్ 11
ఖైరిగూడా గ్రామపంచాయతీ యందు డంపింగ్ యార్డ్ స్మశాన వాటికకు భూమి పూజ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఖైరీగూడా సర్పంచ్ అజ్మీర సంధ్య రాణి మాట్లాడుతూ భారతదేశాన్ని అగ్రదేశo గా నిలబెట్టడానికి భారత ప్రధాని నరేంద్రమోడీ అన్ని గ్రామ పంచాయతీలకు స్మశానవాటికలో మరియు డంపింగ్ యార్డులను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేయడం హర్షణీయం విషయమని గ్రామ పంచాయతీలకు 95 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం అని పల్లె భారత దేశానికి పట్టుకొమ్మలు అని పల్లెల అభివృద్ధి జరిగితే భారతదేశం అభివృద్ధి జరిగినట్లేనని పల్లెలను గ్రామ పంచాయతీలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి భారతదేశంలోని పల్లె ప్రజలు రుణపడి ఉంటారని వారు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ ఇన్చార్జి ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీర ఆత్మారాం నాయక్ పంచాయతీ సెక్రెటరీ శంకర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ తుకారాం వార్డు సభ్యులు రవి ఉప సర్పంచ్ సంతోష్ కో ఆప్షన్ సభ్యులు సక్రు నాయక్ కారోబార్ వసంతరావు అరవింద్ పాల్గొన్నారు