YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

రెవెన్యూ ఉద్యోగుల మౌన దీక్షలు, రక్షణ కు కలెక్టర్, ఎస్పీ కి వినతి పత్రాలు.    జిల్లా రెవెన్యూ సంఘం ట్రెసా జగిత్యాల

రెవెన్యూ ఉద్యోగుల మౌన దీక్షలు, రక్షణ కు కలెక్టర్, ఎస్పీ కి వినతి పత్రాలు.    జిల్లా రెవెన్యూ సంఘం ట్రెసా జగిత్యాల

రెవెన్యూ ఉద్యోగుల మౌన దీక్షలు, రక్షణ కు కలెక్టర్, ఎస్పీ కి వినతి పత్రాలు.   
 జిల్లా రెవెన్యూ సంఘం ట్రెసా జగిత్యాల
జగిత్యాల నవంబర్  11
రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు నిరసనగా జగిత్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట మౌన దీక్ష చేశారు.తరువాత జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేశం,అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి లకు రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని జిల్లా రెవెన్యూ గౌరవ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,జిల్లా అధ్యక్షులు ఎం.డీ.వకీల్,కలెక్టరేట్ పరిపాలన అధికారివెంకటేష్ ల ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి రక్షణ లేక పోవడంతో తహసీల్దారు విజయారెడ్డి పై నిందితుడు పెట్రోలు పోసి సజీవదహనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగుల పై జరుగుతున్న అసత్య,దూషణ ప్రచారాలు,బెదిరింపు ఘటనలపై చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి హామీ ఇవ్వడం ,ఇబ్రహీంపట్నం  తహసీల్దారును బెదిరించిన నిందితుడిని అరెస్ట్ చేసి చట్ట పర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపి ధన్యవాదాలు తెలిపారు. ధరణి లోని అన్ని ఆప్షన్లు తహసీల్దారు లాగిన్ లో ఉంచుటకు,పూర్తిస్థాయిలో సీఎల్ ఎ ను నియామకం, శాసన సభ ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు పంపిన తహసీల్దారులను తిరిగి స్వంత జిల్లాల కు వెంటనే బదీలీలు చేయుటకు, ఆర్డర్ టూ సర్వ్ ఉద్యోగులను కోరిన జిల్లాలకు బదిలీలు, ఖాళీలు భర్తీ అంశాలను ప్రభుత్వ దృష్టికి  నివేదిక పంపుతామని జాయింట్ కలెక్టర్ చెప్పారని ,ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రెసా గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,జిల్లా రెవెన్యూ అధ్యక్షుడు ఎండీ వకీల్, కార్యదర్శి కృష్ణ, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్,కలెక్టరేట్ ఏవో ఎన్. వెంకటేష్, ఆర్డీవో ఏవో.ధీలీప్ నాయక్,తహసీల్దారులు నవీన్,శ్రీనివాసరావు, రాజేశ్వరి, పద్మావతి, ప్రసాద్,లక్ష్మారెడ్డి,నాయబ్ తహసీల్దారులు,గీర్దావర్లు,వీఆర్ ఓలు,వే ఆర్ ఏ లు,18 మండలాల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts