YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 మీడియాలో  పేపర్స్ వార్

 మీడియాలో  పేపర్స్ వార్

 మీడియాలో  పేపర్స్ వార్
విజయవాడ, నవంబర్ 11, 
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెడతామని జగన్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రకటన పట్ల ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. విద్యార్థులకు మాతృభాష తెలుగును దూరం చేయడం ఏంటని చంద్రబాబు, పవన్, లోకేశ్ తదితర నేతలు మండిపడుతున్నారు. దీనికి జగన్‌తోపాటు అధికార పార్టీ నేతలు కూడా ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు.‘మీ పిల్లలేమో ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే.. పేదలు మాత్రం తెలుగు మీడియంలో చదువుకోవాలా?’ అని పవన్, చంద్రబాబులను జగన్ ప్రశ్నించారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్.. పవన్‌పై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు.తెలుగు విలువ వైఎస్ఆర్సీపీకి తెలుసా? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. టీడీపీ హయాంలో సాక్షి పత్రికలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను షేర్ చేశారు. వైఎస్ఆర్సీపీ తీరును ఆయన ఎండగట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఇదని ఆయన గుర్తు చేశారు.మాతృభాషకు మంగళం!, ఇప్పటికిప్పుడు ఇంగ్లిష్ మీడియా? పేరిట సాక్షి ప్రచురించిన కథనాలను పవన్ ట్వీట్ చేశారు. ఇవే వార్తల క్లిప్పింగ్‌లను లోకేశ్ కూడా ట్వీట్ చేశారు.ఎందుకింత తెగులు?', 'తెలుగు లెస్సేనా?' అంటూ ఉద్యమం చేసిన రోజు మీ బుద్ధి ఏమయ్యింది? అని జగన్‌ను ప్రశ్నించారు. 'ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు' అని మీరు ఉద్యమం చేసినప్పుడు మీ అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా? అని లోకేశ్ నిలదీశారు.టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా సాక్షి పత్రిక క్లిప్పింగ్‌లను ట్వీట్ చేస్తున్నారు. వాస్తవానికి వైఎస్‌కు, జగన్‌కు రాజకీయంగా అండగా ఉండటం కోసం.. ఆ రెండు పత్రికల దుష్పచారాన్ని తిప్పొకొట్టడం కోసం సాక్షి పత్రిక, ఛానల్‌ను ఏర్పాటు చేశారు. కానీ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘సాక్షి’ పత్రిక సర్క్యులేషన్ పెద్దగా పెరిగిందేం లేదు. జగన్ వాయిస్‌ను బలంగా వినిపించడానికి ఉద్దేశించిన ఈ పత్రిక క్లిప్పింగ్‌లు.. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంలా మారాయి. పవన్, లోకేశ్, చంద్రబాబు తదితర నేతలు ‘సాక్షి’ క్లిప్పింగ్‌లను షేర్ చేసి మరీ గతంలో జగన్ మాట్లాడిన అంశాలను, ‘సాక్షి’ కథనాలను బయటపెడుతున్నారు.

Related Posts