జగన్ డైరెక్ట్ టార్గెట్...
సంయమనం పాటించండి : జనసేనాని
విజయవాడ, నవంబర్ 11
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై పొలిటికల్ హీట్ పెరుగుతోంది. జగన్ సర్కార్-విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ సీఎం ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటరిస్తూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో పాటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యలను టార్గెట్ చేశారు. పవన్ వ్యక్తిగత జీవితంపైనా ఏపీ సీఎం వ్యాఖ్యలు చేశారంటూ జనసేన ఆరోపిస్తోంది. అయినా సరే సంయమనం పాటించాలంటూ ఆ పార్టీ పిలుపునిచ్చింది. జగన్ వ్యాఖ్యలపై జనసైనికులు స్పందించొద్దని ఓ ప్రకటన విడుదల చేసింది జనసేన తన ప్రకటనలో.. ‘ఏ.పీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యక్తిగత ఆరోపణలపై మన పార్టీ నాయకులు గాని జనసైనికులు గాని స్పందించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. భవన నిర్మాణ కార్మికుల కోసం మనం చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నాము. మన అధ్యక్షులు ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు బాధాకరమైనప్పటికీ ప్రజా క్షేమం కోసం మనం భరిద్దామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మంగళవారం పవన్ కళ్యాణ్ విజయవాడ వస్తున్నారు.పార్టీ అధ్యక్షులు అన్నిటికీ బదులిస్తారు. దయచేసి పార్టీ శ్రేణులు సంయమనంపాటించవలసిందిగా కోరుతున్నాను’అన్నారు.జగన్ వ్యాఖ్యలపై జనసేన శతఘ్ని స్పందించింది. ఏపీ సీఎం వ్యాఖ్యలకు కౌంటరిస్తూ.. ఓ వీడియోను ట్వీట్ చేసింది. ‘మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల వల్ల అంట నిజమా జగన్’అంటూ ప్రశ్నించారు