YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

సముద్రంలో మునిగిన బోటు

Highlights

  • గ్రీస్ తీరంలో 14 మృత దేహాల స్వాధీనం
  • కొనసాగుతున్న గాలింపు చర్యలు
సముద్రంలో మునిగిన బోటు

వలసవాదులు ప్రయాణిస్తున్న ఓ బోటు మునిగిపోవడంతో గ్రీస్ తీరంలో 14 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తీర ప్రాంత దళ అధికారులు శనివారం తెలిపారు. మిగిలిన వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు. మూడు విమానాలు, గ్రీక్ నావికాదళం, తీరప్రాంత రక్షణ దళానికి చెందిన నౌకలు, యురోపియన్ సరిహద్దు రక్షణా సంస్థకి చెందిన నౌక, ప్రైవేటు బోట్లు రంగంలోకి దిగాయి. గ్రీక్ దీవి సామోస్కు దక్షిణంగా తొలుత నలుగురు చిన్నారులు, ఒక మహిళ, పురుషుడి మృత దేహాలు లభ్యమయ్యాయని కోస్ట్ గార్డ్ అధికారి తెలిపారు.కొద్ది సేపటి తర్వాత మరో 8 మృత దేహాలు దొరికాయని చెప్పారు. అయితే వీరిలో చిన్నారులు వున్నారో లేదో ఇంకా తెలియరాలేదని అన్నారు. కాగా ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగలిగారు. వారు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. తాము 21మందిమి ఒక చెక్క బోటులో బయలుదేరామని, మార్గమధ్యంలో అది మునిగిపోయిందని వారు అధికారులకు తెలిపారు.

Related Posts