YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

*కార్తిక పురాణం - 15 

*కార్తిక పురాణం - 15 


*కార్తిక పురాణం - 15 

*15వ అధ్యాయము -  దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట 
*అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.*
*ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును.*
*శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విదువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచ వలెను.*
*ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.*
*సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయ మొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.**ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచి చూడగా, ప్రక్కనొక మానవుదు నిలబడి యుండుటను గమనించి "ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి?" అని ప్రశ్నించగా, "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుంది ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.**అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తిను బండారములను కడుచౌకగా కొని, తిరిగి వాతిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించు చుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.*
*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.*పిల్లలిక పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు. 
అవడానికి  పెద్దాడివే అయినా అల్లరిచేశావు. 
అందరాని చందమామ కోసం అలకలు పోయావు. 
కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు. 
బాగా చిన్నప్పుడే ఆస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రులవారి వెనకాల పంపిస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళ్ళిపోయావు. 
ఆయన్నేర్పిన నాలుగు ముక్కలూ వంటబట్టించుకుని తిరిగొచ్చావు. 
ఎంత వీరుడివే అయినా నచ్చిందికదా అని నచ్చినట్టు చేసెయ్యకుండా గురువు గారు చెప్పినట్టు నీ ప్రతిభను ప్రదర్శించాకే ఆవిణ్ణి కట్టుకున్నావు. తీరా పెళ్ళయ్యీ భోయనాలకి కూచుందా మనుకుంటోంటే ఆయనెవడో గొడ్డలట్టుకు బయల్దేరాడు. 
చెప్పొద్దూ! అంతహంకారం పనికి రాదని మర్యాదగా చెప్పే ధైర్యం ఎవరికీలేదు. 
ఎంతటి పరాక్రమవంతుడైనా గర్వం వుంటే అది ప్రతిభను ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించేశావు.
ఎంత ముద్దు చేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు. నీకు పట్టాభిషేకం చేద్దామని, ఏదో పెద్దాయన సరదాపడ్డాడే అనుకో,ఆవిడగారేమో ఆయాల మాటట్టుకుని నానా యాగీ చేసేసింది. నిన్ను రాజుని చెయ్యడానికి వీల్లేదు పొమ్మంది. అక్కడితో ఆక్కండా అడవుల్లోకి పొమ్మని ఆర్డరేసేసింది. ఇక్కడుంటే తమిళనాడులోలా మిగతా ఎమ్మెల్యేల్ని ప్రభావితం చేస్తావనో ఏఁవిటో? పోనీ అప్పుడైనా మంత్రిపదవి దక్కలేదని మా ఎమ్మెల్యేల్లా అలిగావా? లేదు.
‘నాన్నారెలా చెబితే అలానే!’ అంటూ డ్రెస్ మార్చేసి ఎక్కడికెళ్ళాలో అడ్రెస్సైనా అడక్కండా బయల్దేరిపోయావు. 
నీకు తోడు ఆవిడా అలాంటిదే!‘మీరెళితే వెళ్ళండి! నేనిక్కడే  మా అమ్మావాళ్ళింటోవుంటాను. మీరొచ్చేముందు ఓవుత్తరం రాసిపడెయ్యండి. వచ్చేస్తా’నన్లేదు. 
తనూ నారబట్టలు కట్టేసుకుని, మావారెక్కడుంటే అక్కడే నాకు వెన్నెలంటూ తయారైపోయింది.
ఇహ మీతమ్ముడు. చిన్నచిన్న సాయాలడగడానికే భయం వేసేస్తోంది తమ్ముళ్ళని! వందచెప్తారు. 
డబ్బడిగితే జేబుఖాళీ అంటారు. పన్చెబితే చెయిఖాళీలేదంటారు. 
అలాంటిది నీతోపాటు తనూ తయారైపోయాడు. కష్టాలూ, కన్నీళ్ళూ కలబోసుకున్నారు.
వాళ్ళతో కలిసి నీ మూలాల్ని మరిచి కందమూలాల్నే తిన్నావు. నిశ్శబ్ద మందిరాల్లో నిదరోయే మహరాజు బిడ్డవే అయినా క్రూరమృగాల కూతల మద్య, కీచురాళ్ళ మోతలమద్య ఒఠ్ఠి కిందే పడుకున్నావు.
ఒకటారెండా....పధ్నాలుగేళ్ళు! 
ఎన్నో తప్పులుచేసిన మావాళ్ళైతే గుండెనొప్పని చెప్పేసి పొలోమని అపోలోలో చేరిపోతారు. 
జెయిలంటే బెయిలంటారు. కనీసం ఒక్కనెలయినా మా సరదా తీర్చకుండా బయటే ఊరేగుతూ వుంటారు.
అలాంటిది నువ్వే తప్పూ చెయ్యకుండానే దండకారణ్యాల్లో దండననుభవించావు. 
అందమైన జీవితాన్ని అడవిపాలు చేసేసుకున్నావు. అడవికాచిన వెన్నెల్లోనే సీతమ్మతో ఆనందాన్ని పంచుకున్నావు. 
నిన్నర్ధం చేసుకోడానికి మాకెన్ని యుగాలైనా సరిపోవట్లేదు. 
ఇంట్లో అన్నీ వుంటేనే పెళ్ళాం కోరిన సినిమాకి తీసికెళ్ళడానికి తీరికలేదంటాం! 
అట్టాంటిది ఆవిడేదో సరదాపడిందని,        ఆ లేడికన్నుల్లో బంగారులేడిని చూసి మెరిసిన ఆనందాన్ని చూసి, మురిసి మురిపం చెంది,  తెద్దాంవని బయల్దేరావు.
మాయలూమంత్రాలతో కట్టుకున్నదాన్ని పట్టుకెళిపోతే చెట్టుపుట్టల్ని వేడుకున్నావు. చెట్టపట్టాలేసి కోతులతో కలిశావు.
ఏ మాయా చెయ్యలేదు. కుతంత్రాలూ లేవు. 
నిస్సహాయతనేది సామాన్య మానవుణ్ణి ఎలా బాధిస్తుందో నిరూపించావు. 
మా హీరోల్లా విలనింట్లోనే కుటుంబమంతా చేరి, వాళ్ళందర్నీ వెర్రిపీనుగుల్ని చేసి ఆడేసుకుని, చివరాఖర్న వాళ్ళింటమ్మాయిని తెచ్చేసుకోలేదు. ఎంతో ఇష్టంకాబట్టే ఎంత కష్టపడాలో అంతా పడ్డావు. 
ఏ సాయమూ దొరక్కపోతే దొరికిన సాయాన్ని ఎలా వాడుకోవాలో నువు చెప్పినట్టు ఏ మనోవైజ్ఞానిక గ్రంథాలూ చెప్పలేదు.
తాతయ్య నోటివెంట నీ కథ విన్న ప్రతి మనవడికీ వచ్చే మొదటనుమానం కోతుల్నెలా లొంగదీసుకోడమని! 
అదీ చూసేవాళ్ళం మా చిన్నతనాల్లో! చెప్పినపనల్లా చేసిపెట్టే కోతుల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళం! 
వాటికి శిక్షణనివ్వడానికి వాడెంతకాలం కృషిచేశాడో తెలీని మాకు వినోదమే కనబడేది! 
ఇపుడాలోచిస్తే నిలకడలేని ఆ వానరుల ఓనరుతో నువు చేసిన స్నేహమూ, ఆనక వాళ్ళ సాయంతోనే నువు కట్టిన వారధీ చూస్తే... దుస్సాధ్యం వుంటుందేమోగానీ అసాధ్యమనేది వుండబోదని అనిపిస్తుంది!
సెభాషోయ్ రామా! నీ గురించి మొదలెడితే నిండిపోయింది మనసు. నిద్రా, నీళ్ళూ గుర్తురావట్లా! 
నిజాయితీకి నిదర్శనం, నిరాడంబరతకి నిలువెత్తు దర్పణం నీ జీవితం!
నిలకడ లేని వాళ్ళతో పొంతన
నీళ్ళను దాటడానికొక వంతెన
నిర్భయమేగా వుంటే నీ చెంతన నిరాధారుల కిచ్చావు సాంత్వన
నిరుపమానం నీ మార్గమెంతైనా
నిరతమూ మాకదే కదా చింతన
నీకందుకే మండే ఎండల్లోనూ కిక్కిరిసిన పందిళ్ళలో కిక్కురుమనకుండా కూర్చుని కళ్యాణం జరిపిస్తాం!
నకనకలాడే ఆకలికి పానకాలతోనే పొట్టనింపుకుని 
నీకన్నం పెట్టిన తరవాతే ముద్ద మింగుతాం!
పదిమందీ కలిస్తే పండగ! పదిమందికి మంచిచేస్తే కళ్యాణం! 
పదిమందికి అన్నం పెట్టడం లోకకళ్యాణం!
అందాలరాముడు... అందుకే మా దేముడు
 

   

 

Related Posts