కశ్మీర్ లో ప్రారంభమైన రైలు సర్వీసులు
శ్రీనగర్
ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లో ఆగస్టు 5 న నిలిచిపోయిన బస్సు, రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం మినీ బస్సు సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు. మంగళవారం నుంచి శ్రీనగర్– బారాముల్లా మధ్య ట్రైన్ సర్వీసులు నడుస్తాయని చెప్పారు. సోమవారం నిర్వహించిన రెండు ట్రయల్ రన్స్ విజయవంతమయ్యాయన్నారు. శ్రీనగర్–బనిహాల్ మధ్య ట్రాక్ సేఫ్టీ చెకింగ్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఆ రూట్‌లో కూడా సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. ప్రీ–పెయిడ్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. లోయలోని మార్కెట్, షాపులు కేవలం ఒక్కపూటే తెరుస్తున్నారు. ప్రైవేటు వెహికిల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోందని, దాన్ని కంట్రోల్ చేయడానికి అదనంగా సిబ్బందిని నియమించామని పోలీసులు చెప్పారు