YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

ప్రైవేటీకరణ దిశగా బీపీసీఎల్

ప్రైవేటీకరణ దిశగా బీపీసీఎల్

ప్రైవేటీకరణ దిశగా బీపీసీఎల్
ముంబై, 
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ప్రైవేటీకరణను ఈ నెలలోనే మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీపీసీఎల్‌‌లో ప్రభుత్వానికి ఉన్న మొత్తం వాటాలను అమ్మడంతో పాటు మేనేజ్‌‌మెంట్‌‌ కంట్రోల్‌‌ను ట్రాన్స్‌‌ఫర్ చేయడంపై కేంద్ర కేబినెట్ ఈ నెలలో నిర్ణయం తీసుకోనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీపీసీఎల్ ప్రైవేటైజేషన్ అంశాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ చూస్తోంది. ఈ ప్రభుత్వ రంగ ఆయిల్‌‌ కంపెనీకి లీగల్ అడ్వయిజర్, అసెట్ వాల్యుర్, ట్రాన్సాక్షన్ అడ్వయిజర్ నియామకానికి సంబంధించిన తేదీని ఈ నెల 25 వరకు డిపార్ట్‌‌మెంట్ డిస్‌‌ఇన్వెస్ట్‌‌మెంట్ లేదా డీఐపీఏఎం పొడిగించినట్టు అధికారులు చెప్పారు. బీపీసీఎల్‌‌ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్‌‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది. అయితే ఇప్పటి వరకు బీపీసీఎల్ ప్రైవేటైజేషన్‌‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బీపీసీఎల్‌‌ షేర్లు 2.35 శాతం తగ్గి రూ.501.15గా ఉన్నాయి.ఇండస్ట్రీ వర్గాల ప్రకారం బీపీసీఎల్‌‌లో ప్రభుత్వం నుంచి వాటాలు పొందేందుకు గ్లోబల్ ఆయిల్ సంస్థలు సౌదీ ఆరామ్‌‌కో, రాస్‌‌నెఫ్ట్, కువైట్ పెట్రోలియం, షెల్, టోటల్ ఎస్‌‌ఏ, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీలు ఆసక్తి చూపాయి. ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపాయి. అయితే బీపీసీఎల్‌‌పై ఆసక్తి ఉన్నట్టు ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా బహిరంగంగా కామెంట్ చేయలేదు. షేరు ధర, వాల్యుయేషన్‌‌పై ప్రభావం చూపనుండటంతో లిస్టెట్ కంపెనీల వాటాల విక్రయ ప్లాన్లను పబ్లిక్‌‌గా బహిర్గతం చేయబోమని డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ డిస్‌‌ఇన్వెస్ట్‌‌మెంట్ చెప్పింది. బీపీసీఎల్ ప్రైవేటైజేషన్‌‌ను చేయడానికి డిస్‌‌ఇన్వెస్ట్‌‌మెంట్‌‌కు సంబంధించిన కోర్ గ్రూప్ సెక్రటరీలు ఆమోదించారు.

Related Posts