YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి దేశీయం

 కేంద్ర ప్రభుత్వం ఎస్ సి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలి  

 కేంద్ర ప్రభుత్వం ఎస్ సి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలి  

 కేంద్ర ప్రభుత్వం ఎస్ సి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలి  
కౌతాళం నవంబర్ 12
వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని దానిని ఆమోదించి దళిత కులాలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి సల్మాన్ రాజ్ ప్రభుత్వంను డిమాండ్ చేశారు.  కౌతాళం మండలంలోని గుడి కంబాల మురళి వల్లూరు కుంభాల నూరు గ్రామాలలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా గ్రామాలలో సల్మాన్ రాజ్ మాట్లాడుతూ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ నెలలో చలో ఢిల్లీ ఎం ఆర్పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉంటుంది దానికి అధిక సంఖ్యలో మాదిగలు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. గుడి కంబాల అధ్యక్షులుగా రాజేంద్ర ను మురళి గ్రామ అధ్యక్షుడిగా నాగరాజును వల్లూరు గ్రామ అధ్యక్షుడిగా చిన్న దావీదును కుంబలనురు గ్రామ అధ్యక్షుడిగా విరిపాక్షి ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమములో మండల ఎమ్ ఆర్ పి ఎస్ అధ్యక్షుడు రాజా బాబు, ఆనంద్ రాజు, గుడికంబాల, ఆనంద్, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Related Posts