YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 శివనామ స్మరణలతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు

 శివనామ స్మరణలతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు

 శివనామ స్మరణలతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు
హైదరాబాద్ నవంబర్ 12
కార్తీకపౌర్ణమిశోభతోశైవక్షేత్రాలుకిటకిటలాడుతున్నాయి.శివాలయాలుశివస్మరణలతోమారుమోగుతున్నాయి.శ్రీశైలం,కీసర,వేములవాడ,కాళేశ్వరం,శ్రీళహస్తి,మహానంధి,ముఖ్యంగా కార్తీకపౌర్ణమి సందర్భంగా హంసలదీవి బీచ్ కు భారీగా భక్తులు తరలివచ్చారు. వేలాది మంది భక్తులు సూర్యోదయానికి ముందే సముద్ర స్నానమాచరించారు. పాలకాయతిప్ప నుండి హంసలదీవి బీచ్ వరకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కోడూరు పోలీస్ సిబ్బంది చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భక్తులకు ఏర్పాట్లు చేసి అవనిగడ్డ పోలీసు, మెరైన్ పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బీచ్ లో కోడూరు పి.హెచ్.సి వైద్యబృందం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా రెవిన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏపి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూర్యలంక తీరంలో “కర్పూర హారతి” కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం అంటేనే ఎంతగానో విశిష్టత సంతరించుకున్న రోజు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటాం. కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానమైందని, దీన్ని త్రిపురారి పౌర్ణమి అనికూడా అంటారు. హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన ఈ రోజన దీప దానం చేస్తే సకల పాపాలు తొలగి, మోక్షం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. 

Related Posts