YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

నవంబర్ 14 నుంచి నంబర్ 21 వరకూ ఇసుక వారోత్సవాలు

నవంబర్ 14 నుంచి నంబర్ 21 వరకూ ఇసుక వారోత్సవాలు

నవంబర్ 14 నుంచి నంబర్ 21 వరకూ ఇసుక వారోత్సవాలు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
అమరావతి నవంబర్ 12  (న్యూస్ పల్స్) 
ఈనెల 14వతేదీ నుంచి 21వతేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. మంగళవారం నాడు  స్పందన కార్యక్రమంపై అయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో సరాసరి ఇసుక డిమాండ్ 80వేల టన్నులు వుండేది. వరదలు కారణంగా, రీచ్లు మునిగిపోయిన కారణంగా ఈ డిమాండ్ను చేరుకోలేకపోయాం. గత వారంరోజులుగా ఈ పరిస్థితి మెరుగుడు పడిందని అన్నారు. రీచ్ల సంఖ్య సుమారు 60 నుంచి 90కిపైగా చేరింది. 1.2లక్షల టన్నులను 2 లక్షల టన్నుల వరకూ వచ్చే వారంరోజుల్లో పెంచాలి. 137 నుంచి 180 వరకూ స్టాక్ పాయిట్లు పెంచాలి. ఇసుక వారోత్సవాల్లో భాగంగా ఇవన్నీ చేయాలని ఆదేశించారు.జేసీలను ఇన్ఛార్జీలు పెట్టాం కాబట్టి, వారు స్టాక్పాయింట్లను పూర్తిగా పెంచాలి. వారోత్సవం అయ్యేలోపు 180కిపైగా స్టాక్ పాయింట్లు ఉండాలని అన్నారు.  ఇసుక ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే రీచ్ లు సీజ్ చేస్తామన్నారు. అక్రమాలకు పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. రెండు రోజుల్లోగా రేటు కార్డు డిసైడ్ చేయాలని జగన్ అధికారులకు ఆదేశించారు. జిల్లాల వారీగా రేటు కార్డులపై ప్రచారం చేయాలని సీఎం సూచించారు. ఎవరైనా ఎక్కువ అమ్మితే పెనాల్టీయేకాదు, సీజ్ చేయడమే కాదు, 2 ఏళ్ల వరకూ జైలుశిక్షవిధించాలని అన్నారు. ఇసుక కొరత తీరేంతవరకూ ఎవ్వరూడా సెలవులు తీసుకోకూడదు. ఇసుక తవ్వకాల్లోకాని, విక్రయాల్లోకాని సిబ్బంది సెలవులు తీసుకోకుండా పనిచేయాలి.  సరిహద్దుల్లో ప్రతి చోటా చిన్నరూట్లు, పెద్ద రూట్లలో చెక్పోస్టులు పెట్టాలి. 10 రోజుల్లో చెక్పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తికావాలి. కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్ అండ్ బి, ఏపీ ఎండీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Related Posts