వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు బాలురు మృతి
సిద్దిపేట నవంబర్ 12
కోహెడ మండలం వరికోల్ గ్రామంలో విషాదం నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానికంగా ఉన్న వాగులో స్నానం చేసేందుకు ముగ్గురు బాలురు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఆ ముగ్గురు నీటిలో మునిగి చనిపోయారు. మృతి చెందిన ముగ్గురు బాలురను నిఖిల్, ప్రశాంత్, వరప్రసాద్‌గా గుర్తించారు. వీరి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.