YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిల్లో మందుల కొరత 

ప్రభుత్వ ఆసుపత్రిల్లో మందుల కొరత 

ప్రభుత్వ ఆసుపత్రిల్లో మందుల కొరత 
మహబూబ్ నగర్, 
ప్రభుత్వ ఆసుపత్రిల్లో మందుల కొరత వేదిస్తోంది. ఉమ్మ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రోగులకు అందాల్సిన అత్యవసర మందులతో పాటు గోలిలు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య గత నెల రోజులుగా ఉన్నప్పటికి అధికారుల్లో చలనం లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు గోలిలు సైతం బయటికి రాసిస్తున్నారు. డబ్బులు లేక పేదలు మందు కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందులు సైతం అధిక ధరలు ఉండటంతో రోగులు వాటిని కొనుగోలు చేయలోకపోతున్నారు. జనరిక్ మందుల షాపులు అంతంత మాత్రమే ఉన్న వాటిపై రోగులకు, ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ షాపులపైనే మందులకు ఆధారపడతున్నారు. డాక్టర్లు సైతం ప్రైవేట్ కంపెనీల మెడికల్ రెఫ్‌లు సూచించిన కంపెనీల మందులను రెఫర్ చేస్తున్నారు.దీంతో మందులకే రోగులు అధిక ఖర్చు చేస్తుండటంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 28 ఆరోగ్య కేంద్రాలు, 215 ఆరోగ్య ఉప కేంద్రాలు, 2 పీపీ యూనిట్లు, మూడు సివిల్ ఆసుపత్రులు, ఆరు అర్భన్ హెల్త్ సెంటర్లు , ఒకటి ఎంసీహెచ్ సెంటర్ ఉన్నాయి. గత మూడు నెలలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాలు కుర్వడంతో సిజనల్ వ్యాధులు కూడా విజృంభించాయి. అనేక మంది ప్రాణాంతకమైన మలేరియా , డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి వ్యాధుల భారిన పడిన విషయం తెల్సిందే. ఇప్పటి కూడా అనేక గ్రామాల్లో వ్యాధులు విజృంభిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ఆసుపత్రుల్లో కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆయా వ్యాధులతో వస్తున్న రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వైద్యం అందకపోవడంతో పా మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఏదో ఒక మందులు రాసి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పిహెచ్‌సీ కేంద్రాలు సైతం రోగులకు సరిపడే మందులు అందుబాటులో లేవు. ముందస్తుగానే మందు కొరతలు గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన జిల్లా వైద్యశాఖ అధికారులు అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సమస్య తీవ్రమైంది. దీం ప్రైవేట్ మెడికల్ షాపులపై మందుకు రోగు ఆధారపడుతున్నారు. ఆసుపత్రుల్లో కనీస అత్యవసర మందులు కూడా అందుబాటు లేకున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా పాముకాటు, తేలుకాటు, కుక్కకాటు వంటి మందులు కూడా అందుబాటులో లేవ వాపోతున్నారు. రోగుల సంఖ్య రోజురోజు పెరుగుతున్నా వారికి సరపడా వైద్య సేవ కూడా అందడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పీహెచ్‌సీ కేంద్రాల్లో పరిస్థితులు మరి అధ్వానంగా ఉన్నట్లు చెబుతున్నారు. వైద్య సిబ్బంది ఆసుపత్రుల్లో అందుబాటులో లేకుండా ఉంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బం 24 గంటల ఆసుపత్రిలో 24 గంటలు విధు నిర్వహించాల్సినప్పటికి రాత్రి సమయాల్లో ఉండటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నా దీంతో రాత్రి సమయాల్లో వైద్యులతో అ గురై వచ్చే రోగులను పీహెచ్‌సీ వాపోతున్నారు.పెంచనర్లు, జర్నలిస్టులు, పదవి విరమణ పొం ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్‌లో సై మందుల కొరత వేదిస్తోంది. 5 జిల్లాలకు కలిపి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్ ఆవరణలో కేవలం ఒకే ఒక వెల్‌నెస్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడకు ప్రతి రోజు వందల సంఖ్యలో పెంచనర్లు తమ ఆరోగ్యాన్ని చూయించుకునేందుకు వస్తున్నారు. మహబూబ్‌నగర్ వెల్‌నెస్ సెంటర్‌లో జరనల్ మెడిసిన్, అర్థోపిడిక్ డెంటల్‌కు సం డాక్టర్లు ప్రభుత్వం నియమించిం గతంలో ఈ వెల్‌నెస్ సెంటర్‌కు 50 నుంచి వంద మంది రోజుకు వచ్చేవారు. నేడు ఆ సం 200 నుంచి 250 మంది దాక వైద్య సేవలను పొందేందుకు వస్తున్నారు. అయితే వారి మందుల కొరత ఇబ్బందిగా ఉంది. వెల్‌నెస్ సెంటర్‌లో 300 రకాల మందులను పంపిణి చేయాలి.ప్రతి నెల ఈ సెంటర్‌కు 40 నుంచి 50 లక్షలు విలువ చేసే మందుల పంపిణీ అ ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వం సరఫరా చేయాల్సిఉంది. ప్రస్తుతం కేవలం 200 రకాల మందులే సరఫరా చేస్తున్నారు. బీపీ, షుగర్, వైద్యులకు సంబంధించిన కొన్ని రకా మందులను ఇవ్వడం లేదు. వాటిని కూడా బయటికి రాస్తున్నారు. ఉన్నవి ఇంతేనని, మిగతావి బయటనే తీసుకోవాలని సలహాలు ఇచ్చి పంపిస్తున్నారు. వెల్‌నెస్ సెంటర్‌లో పరీక్షలు కూడా అన్ని బయటనే చేయించుకోవాలని సూచిస్తున్నారు. వాస్తవానికి వెల్‌నెస్ సెంటర్‌లోనే అన్ని పరీక్షలను ఉచితంగా చేయించాల్సినప్పటికి అందుకు సంబంధించిన ల్యాబ్ పరికరాలు ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైన ప్రభుత్వ ఆసుపత్రుల్లోను, వెల్‌నెస్ సెంటర్‌లోను మందుల కొరత తీర్చాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts