
లోకో పైలట్ పరిస్థితి విషమమం
హైదరాబాద్ నవంబర్ 12
కాచిగూడ రైలు ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమయంగా వుందని డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు కేర్ ఆసుపత్రి ఒక హెల్త్ బులిటెన్ మంగళవారం మద్యాహ్నం విడుదల చేసింది. ఘటనలో గాయపడిన వారు సాజిద్ , శేఖర్ , బేలేశ్వరమ్మ , రాజ్ కుమార్ , మహమ్మద్ ఇబ్రహీం , పైలెట్ చంద్ర శేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కేర్ హాస్పిటల్ మెడికల్ సూపరిడెంట్ డా.సుష్మ మీడియాతో మాట్లాడారు. ప్రయాణికులు శేఖర్ బేలేశ్వరమ్మ , రాజ్ కుమార్ లకు ఫ్రాక్చర్స్ అయ్యాయి. వాళ్లకు వైద్యం అందిస్తున్నాం. లోకో పైలెట్ శేఖర్ కు పక్కటెముకలు విరిగాయి. కిడ్నీ కుడా దెబ్బతిన్నది. రెండు కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోయింది. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నాడని తెలిపారు. చంద్ర శేఖర్ కు శరీరం మొత్తం గాయాలు అయ్యాయి. 24 గంటలు పర్యవేక్షిస్తున్నాం. కండిషన్ క్రిటికల్ గానే ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నామం. ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.