
సహజసిద్ధమైన ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ఫర్టిలైజర్ లేకుండా వరి పంట...
వనపర్తి నవంబర్ 12
క్రిమిసంహారక మందులు వేయకుండా సహజసిద్ధమైన ఎరువులతో పండించిన ధాన్యం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని రైతు అంజయ్య వ్యక్తపరిచారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చాకల్ పల్లి గ్రామానికి చెందిన అంజయ్య తనకున్న పొలంలో వరి పంటను సాగు చేసుకున్నడు. కాగా క్రిమిసంహారక మందులను వాడి అధిక దిగుబడులను పొందుతున్నామని రైతులు చెబుతున్నారే తప్ప దాంతో అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవుతున్న విషయాలను రైతులు గుర్తించలేకపోతున్నారు అని ఆయన అన్నారు. అనారోగ్యానికి గురైన వారందరిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫర్టిలైజర్ వేసిన పంటల వల్ల పలు వ్యాధులకు గురవుతున్నట్లు డాక్టర్లు తెలపగా తాను స్పందించి క్రిమిసంహారక మందులు వాడకూడదని నిర్ణయం తీసుకున్నానని ఆయన సత్య వార్త బ్యూరో తో అన్నాడు. నారు వేసిన అప్పటినుంచి పంటకోత వరకు క్రిమిసంహారక మందులు వాడుతున్న నేపథ్యంలో తాను తన పొలంలో మొదటగా జీనుగ ను పండించి దానిని పొలంలో మురుగ పెట్టి దునుంచి వరి పైరును నాటనని అంజయ్య తెలిపారు. ఏలాంటి క్రిమిసంహారక మందులు వాడకపోవడం వల్ల పంట దిగుబడి చాలా తక్కువగా వచ్చిందని, అయినా కూడా సహజసిద్ధమైన ఎరువులతో పంటలు పండించి వచ్చిన ధాన్యంతో పలువురికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తున్న నందున తనకెంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఎవరైనా ఈ ధాన్యం కావాలంటే తను సంప్రదించి ధాన్యాన్ని పొందాలని ఆయన అన్నారు.