YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

చరిత్రలో ఈ రోజు..

Highlights

 

  • తేదీ : 17 -03 -  2018 , శనివారం  
చరిత్రలో ఈ రోజు..

 సంఘటనలు..

1967: భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.

1982 : కేరళ లో రాష్ట్రపతి పాలన

2012: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

 జననాలు..

763  : ప్రఖ్యాతిగాంచిన అబ్బాసీయ ఖలీఫా హారూన్ రషీద్ జననం (మ.809).

1887: డి.వి.గుండప్ప, ప్రముఖ కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (మ.1975)

1892: రాయప్రోలు సుబ్బారావు, ప్రముఖ తెలుగు కవి. (మ.1984)

1896: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1976)

1936: కోవెల సుప్రసన్నాచార్య, సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, కవి.

1957: నామా నాగేశ్వరరావు, ప్రముఖ వ్యాపారవేత్త మరియూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు.

1962: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (మ.2003)

1963: రోజర్ హార్పర్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1973: పెద్ది రామారావు, నాటకరంగ ప్రముఖులు, కవి, తెలుగు కథా రచయిత మరియు రంగస్థల అధ్యాపకులు.

1975 : పంజాబీ గాయకుడు-పాటల రచయిత, నటుడు, మరియు నిర్మాత బబ్బూ మన్ జననం.

1990: సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రిడాకారిణి.

మరణాలు

1961: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు, సంపాదకులు, స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త. (జ.1881)

1984: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత. (మ.1884)
                
జనరల్ నాలెజ్డి..
1). మొదటి తెలుగు నవల రాజశేఖర చరిత్రను రచించిన వారు ?
జ: కందుకూరి వీరేశలింగం
2). సైనిక చర్య తర్వాత హైదరాబాద్‌లో భారత ప్రభుత్వం నియమించిన ముఖ్యమంత్రి ? 
జ: ఎం.ఎ.వెల్లోడి
3).1922లో హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్ర జన సంఘం మొదటి సమావేశం అధ్యక్షుడు ?
జ: కొండా వెంకట రంగారెడ్డి
4). బాధ్యతాయుతమైన పరిపాలన తీర్మానాన్ని ఆంధ్రమహాసభ ఏ సమావేశంలో ఆమోదించింది ? 
జ: నిజామాబాద్‌
5). క్షేత్రయ్య ఏ కాలానికి చెందినవాడు?
జ: కుతుబ్‌షాహీల కాలానికి
6). హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించింది ? 
జ. మహమ్మద్‌కులీ కుతుబ్‌షా
7).  అమృతాంజనం కంపెనీని స్థాపించిన ఆంధ్ర పారిశ్రామిక వేత్త?జి సైదేశ్వర రావు
జ: కాశీనాథుని నాగేశ్వరరావు
8). ఆంధ్రదేశంలో స్వాతంత్ర సమరం దేనితో ప్రారంభమైంది?
జ: వందేమాతర ఉద్యమ విస్తరణతో
9). కోటప్పకొండ దొమ్మీకేసు జరిగిన తేదీ ?
జ: ఫిబ్రవరి 18, 1909
10).  బాదామి దేనికి ప్రసిద్ధి ? 
జ: నిర్మాణాత్మక దేవాలయాలుకు పేరుగాంచింది.
11). బసవపురాణం గ్రంథ కర్త ? 
జ: పాల్కురికి సోమనాథుడు
------
1. వార్సా సంధిని ఏర్పాటు చేసిన దేశం ?  
జ: రష్యా 
2. అలీన ఉద్యమ రూపశిల్పి ?  
వహర్‌లాల్ నెహ్రూ
3. నాటో (N.A.T.O.) అనగా ?
జ: నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్
4. తృతీయ కూటమిగా ఏర్పడ్డ దేశాలు ?  
జ: అలీన దేశాలు
5. న్యూడీల్ విధానాన్ని అనుసరించిన అమెరికా అధ్యక్షుడు ?  
జ: రూజ్‌వెల్ట్ 
6. సూయజ్ కాలువను జాతీయం చేసింది ?  
జ: నాజర్
7. కాంగో స్వాతంత్య్రం పొందిన సంవత్సరం ? 
జ: 1960, జూన్ 30
8. ట్రూమన్ సిద్ధాంతం ద్వారా సహాయం పొందిన దేశాలు ?  
జ: గ్రీస్ - టర్కీ
9. ప్రణాళిక, మార్షల్ ప్రణాళికకు ప్రతి చర్యగా ప్రారంభించబడింది  ?
జ: మాల్తోవ్
10. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిత్ర పక్షాల సేనానాయకుడు ?  జి సైదేశ్వర రావు
జ: ఐసెన్ హోవర్
11. బ్రస్సెల్స్ సంధి జరిగిన సంవత్సరం ?  
జ: 1948
12. జావా, సుమత్రా అనే ఇండోనేషియా దేశాలు ... కి చెందిన వలస రాజ్యాలు 
జ: డచ్ వారికి
13. మూడుసార్లు అమెరికా అధ్యక్షునిగా పదవిని చేపట్టిన వారు ఎవరు?  
జ: ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్
14. రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా అగ్ర రాజ్యాలైన దేశాలు ... 
జ: అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ యూనియన్
15. భారతదేశంలో విదేశాంగ విధాన రూపశిల్పి ... 
జ: నెహ్రూ
16. ఏ సంవత్సరంలో చైనా భారతదేశంపై దాడి చేసింది. 
జ: 1962
17. పంచశీల సిద్ధాంతం ...., .... దేశాలకు చెందినది. 
జ: ఇండియా, చైనా
18. భారత విదేశీ విధానపు ముఖ్య లక్షణం .... విధానం.
జ: అలీన
19. ప్రచ్ఛన్న యుద్ధం ముఖ్యంగా..., ... దేశాల మధ్య ఉంది. 
జ: అమెరికా,రష్యా  
20. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రధాని ?
జ: విన్ స్టన్ చర్చిల్
21. ఈజిప్టు రాజనీతిజ్ఞుడు, అరబ్ ప్రపంచానికి నాయకుడు... 
జ: నాజర్
22. స్వతంత్ర ఇండోనేషియా ప్రథమ అధ్యక్షుడు
జ: డా. సుకర్నో
23 . ఏ సంవత్సరంలో నాటో (N.A.T.O.) ఏర్పడింది. 
జ: 1949
24. నాటో (N.A.T.O)కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు దేశాలు కుదుర్చుకొన్న సంధి ?
జ: వార్సా సంధి

Related Posts