YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆరోగ్యం దేశీయం

 క్రిటికల్ గా లతా మంగేష్కర్ ఆరోగ్యం

 క్రిటికల్ గా లతా మంగేష్కర్ ఆరోగ్యం

 క్రిటికల్ గా లతా మంగేష్కర్ ఆరోగ్యం
ముంబై, నవంబర్ 12,
ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌(90) సోమవారం అస్వస్థతకు గురైన సంగ‌తి తెలిసిందే. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ్డ ఆమెను ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ దవాఖానకు తరలించారు. వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు . వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న లతా మంగేష్క‌ర్ ఆరోగ్యం కాస్త విష‌మంగానే ఉన్న‌ప్ప‌టికి, నెమ్మ‌దిగా కోలుకుంటున్నారు. మంగ‌ళ‌వారం ల‌తా పీఆర్ టీం ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నిజం చెప్పాలంటే స‌మ‌స్య నుండి తిరిగి బ‌య‌ట‌కి వ‌చ్చేందుకు ఆమె చాలా పోరాడుతున్నారు. గాయ‌ని కావ‌డంతో ఆమె ఊపిరితిత్తుల‌కి ఉన్న సామ‌ర్థ్య‌మే గ‌ట్టెక్కిస్తుంది. నిజంగా ఆమె పోరాట‌యోధురాలు. ల‌తాజీ డిశ్చార్జ్ అయి తిరిగి ఇంటికి వ‌చ్చిన వెంట‌నే మీ అంద‌రికి ఈ విషయాన్ని తెలియ‌జేస్తాం. ఈ స‌మ‌యంలో వారి కుటుంబ స‌భ్యుల‌కి కొద్దిగా స్వేచ్ఛ‌ని ఇవ్వండి అని పీ ఆర్ టీం పేర్కొన్నారు.ల‌తా త‌న‌ కెరీర్‌లో దాదాపు 26వేలకు పైగా పాటలు పాడగా, అందులో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. తెలుగులో ఆమె కేవలం మూడు పాటలే పాడారు. 1955లో వచ్చిన ‘సంతానం’ సినిమాలోని ‘నిదురపోరా తమ్ముడా’, ‘దొరికితే దొంగలు’ సినిమాలోని ‘శ్రీ వేంకటేశా..’, 1988లో వచ్చిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటలు ఆలపించారు. చివ‌రిగా సౌగంధ్ ముజే ఇస్ మిట్టీకీ సినిమాలో పాట పాడారు. అనేక భార‌తీయ భాష‌ల‌లో పాట‌లు పాడిన ల‌తా మంగేష్క‌ర్‌ని కేంద్ర ప్ర‌భుత్వం 2001లో భార‌త‌ర‌త్న పుర‌స్కారంతో సత్క‌రించింది.

Related Posts