YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం దేశీయం

అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు

అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు

సుప్రీం ఆదేశాలతో ఆలయ కమిటీ ఏర్పాటు
లక్నో, నవంబర్ 12, 
అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి రామమందిరం నిర్మాణ పర్యవేక్షణకు ట్రస్ట్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు అయోధ్య తీర్పును పలువురు అధికారుల బృందం కూ లంకషంగా అధ్యయనం చేస్తున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. ట్రస్ట్ ఏర్పా టు, దాని విధివిధానాలను రూపొందించేందుకు కేంద్ర హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖలతోపాటు పలు కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో బోర్డు ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వ వర్గాలు సోమవారం ధ్రువీకరించాయి. ట్రస్ట్‌లో ఎవరెవరికి భాగస్వామ్యం కల్పించాలనేది నిర్ణయించడానికి ముందుగా సుప్రీంకోర్టు తీర్పును అధికారుల బృందం కూలంకషంగా అధ్యయనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రస్ట్ ఏర్పాటుపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై న్యాయ శాఖ, అటార్నీ జనరల్ అభిప్రాయాలను కూడా తీసుకోనున్నట్లు చెప్పారు. ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ మొదలైందని, అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మరో అధికారి చెప్పారు. మరోవైపు, ట్రస్ట్‌కు నోడల్ సంస్థగా కేంద్ర హోం శాఖ ఉంటుందా లేక సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఉంటుందా అన్నదానిపై స్పష్టత లేదు. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల్లో రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు శనివారం చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి, ఆలయ నిర్మాణ బాధ్యతను ఆ ట్రస్ట్‌కు అప్పగించాలని ఆదేశించింది. అలాగే మసీదు నిర్మాణానికి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే ఒక మంచి స్థలంలో ఐదెకరాల భూమిని కేటాయించాలని కేంద్రానికి కోర్టు స్పష్టం చేసింది. ట్రస్ట్‌కు వివాదాస్పద భూమి కేటాయింపు, సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల భూమి అప్పగింత ఏకకాలంలో జరుగాలని నిర్దేశించింది.మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సరయూ నదిలో పవిత్ర స్నానాలు లక్షలాదిమంది అయోధ్యలో  స్నానాలు చేశారు. రామ్‌కీ పైడీ, నయాఘాట్‌లో భక్తులు స్నానాలు ఆచరిస్తారని అధికారులు తెలిపారు.అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు మీద సమీక్ష కోరాలా వద్దా అనే విషయంపై ఈ నెల 17న జరిగే ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ముస్లిం పక్షాల తరఫు ప్రధాన న్యాయవాది జఫర్‌యాబ్ గిలానీ తెలిపారు. కోర్టు తీర్పు పలు ముస్లిం వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో సమీక్ష కోరుతారా అని ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌తోపాటు పలు ముస్లిం పక్షాల తరఫున ఆయన వాదనలు వినిపించారు.

Related Posts