YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం  - మంత్రి నిరంజన్ రెడ్డి 

పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం  - మంత్రి నిరంజన్ రెడ్డి 

పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం 
- మంత్రి నిరంజన్ రెడ్డి 
వనపర్తి నవంబర్ 12
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం వనపర్తి మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిబంధనలకు అనుగుణంగా పంటలు తీసుకొచ్చే బాధ్యత రైతుల దని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని, ప్రతి రైతు మోముపై చిరునవ్వు చూడాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన అన్నారు. తెలంగాణలోనే పండిన వంటలన్నీ మద్దతు ధరకు కొంటున్నామని, ప్రక్క రాష్ట్రాలలో ఈ పరిస్థితి లేదని, దీన్ని అవకాశంగా తీసుకొని పక్క రాష్ట్రంలో తక్కువ ధరకు వంటలు కొన్ని మన వద్ద అమ్ముతున్న దళారులను అరికట్టేందుకు చెక్ పోస్టులపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులు అందరు కూడా లాభపడాలన్నదే ప్రభుత్వ ఆశయమని, పండించిన పంటలో కేంద్రం 25 నుండి 30 శాతమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా నూరు శాతం పంటలు  మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించిందని ఆయన అన్నారు. మార్కెట్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఒకేసారి రైతులు మార్కెట్కు ధాన్యంతో పోటె త్తకుండా అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. వర్షం వస్తే ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, రాబోయే 50 రోజులు మార్కెటింగ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గ్రామాల వారిగా వేసిన పంటలు వచ్చిన దిగుబడి వివరాలు, వ్యవసాయం, రెవెన్యూ అధికారుల నుండి  సేకరించి అందుబాటులో ఉంచుకోవాలి ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల శ్యాం కుమార్, పొన్నగంటి కృష్ణ, కాగితాల లక్ష్మీనారాయణ, అంగుళం తిరుమల్, నాయకులు గంధం పరం జ్యోతి, బండారు కృష్ణ, సూర్యవంశం గిరి, మురళి సాగర్, శ్రీనివాసులు, డానియల్, శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts