త్వరలో రైతుల ఖాతాలో రైతు భరోసా నగదు జమ
తుగ్గలి నవంబర్ 12
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా నగదు జమ కానీ రైతుల నుండి వ్యవసాయ అధికారులు రైతులకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను స్వీకరించారు.నవంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై స్పెషల్ స్పందన కార్యక్రమాన్ని చేపట్టింది.స్పందన కార్యక్రమంను వినియోగించుకోలేని రైతుల కోసం వ్యవసాయాధికారులు మరొక మారు అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన తుగ్గలిలో మరియు జొన్నగిరి తదితర గ్రామాలలో వ్యవసాయ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు వైయస్సార్ రైతు భరోసా నగదు జమ కానీ రైతుల నుండి అర్జీలను స్వీకరించారు.రైతు భరోసా పథకం అమలు కాని వారు నవంబర్ 15 లోపు రైతులకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం,ఆధార్ జిరాక్స్,బ్యాంకు పాస్ బుక్ జిరాక్సు లను వ్యవసాయ అధికారులకు అందజేయాలని అధికారులు రైతులకు తెలియజేశారు.త్వరలోనే రైతుల ఖాతాల్లో వైఎస్సార్ రైతు భరోసా నగదు జమ అవుతుందని అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ లు జిలాన్ భాష,రంగన్న, విఆర్ఓ నాగేంద్ర,విఆర్ఏ నాగేష్,గ్రామ వాలంటీర్లు,రైతులు తదితరులు పాల్గొన్నారు.