విదేశి పర్యటనలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ నవంబర్ 11
పదకొండవ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్‌కు మంగళవారం పయనమయ్యారు. బుధవారం ప్రారంభం కానున్న ఈ సమావేశం సందర్భంగా పలు దేశాధినేతలతో మోదీ విడిగా సమావేశం అవుతారు.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాస్ తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాధినేతలు పాల్గొననున్న 'బ్రిక్స్' సమావేశం గురువారం ముగియనుంది.