YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మహిళా ఉద్యోగులకు మార్షల్ ఆర్ట్స్

మహిళా ఉద్యోగులకు మార్షల్ ఆర్ట్స్

మహిళా ఉద్యోగులకు మార్షల్ ఆర్ట్స్
జగిత్యాల  నవంబర్ 11 
తాహసీల్దార్ విజయ రెడ్డి  సజీవదహనం నేపథ్యంలో దుండగుల దాడి నుండి తమను తాము రక్షించుకునేందుకు అన్ని ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి) నిర్ణయించిందని టీ ఉద్యోగ ఐకాస జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఎన్జీవో భవన్లో జరిగిన సమావేశంలో ఆయన  జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అధ్యక్షుడు ఎండి. వాకీల్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్లతో కలిసి మాట్లాడారు.  గత వారం రోజుల క్రితం తాహసీల్దార్ విజయ రెడ్డి పై  ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ఉద్యోగుల, మహిళా ఉద్యోగుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది అన్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించడం తో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తప్పనిసరిగా చేయాలని అని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం నిర్ణయించినట్లు ఆయన  మహిళా ఉద్యోగుల అధికారీనుల సమాచారం తెలిపారు. 

Related Posts