YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్టీసీ సమ్మె..పిటిషన్పై హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా

ఆర్టీసీ సమ్మె..పిటిషన్పై హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా

ఆర్టీసీ సమ్మె..పిటిషన్పై హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా
హైదరాబాద్ 
ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ను ఉన్నత న్యాయస్థానం కోరింది. ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని విద్యాసాగర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్ ఆర్టీసీకి అని.. 2015లో ఇచ్చిన ఉత్తర్వులు ఆరునెలల వరకే అమల్లో ఉంటాయని పేర్కొంది.  ఏపీఎస్ ఆర్టీసీపై ప్రయోగించిన ఎస్మా టీఎస్ఆర్టీసీపై ఎలా వర్తిస్తుందని హైకోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని సీనియర్ కౌన్సిల్ స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడు వర్తిస్తాయా అని హైకోర్టు ప్రశ్నించింది.మరోవైపు బస్సుల్లో అధికఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ తెలపగా  దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధికఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. సమ్మె లీగలా.. ఇల్లీగలా అనేది నిర్ణయించడం తమ పరిధిలో లేదని కోర్టు పేర్కొంది. 
పరిధి దాటి వ్యవహరించలేం..చర్చలు జరపాలని ప్రభుత్వం లేదా ఆర్టీసీని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Related Posts