వైభవంగా గిరి ప్రదర్శన
కాకినాడ నవంబర్ 12
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి గిరిప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది .కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో లక్షలాదిగా భక్తులు అన్నవరం కి తరలి వచ్చారు సత్యనారాయణ స్వామి వారి రథం వెనక అడుగులో అడుగు వేశారు .ముందుగా అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ అర్చకులు, ఆపై పూల పందిరి వాహనంలో స్వామి అమ్మవారిని వేయించిప చేసి హారతులు అందజేశారు ,ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు జెండా ఊపి యాత్ర ప్రారంభించారు, .వెనుక మరో సత్యనారాయణ స్వామివారి పల్లకి గిరి యాత్ర లో పాల్గొంది .బాజాభజంత్రీలు ఆధ్యాత్మిక గీతాలు.కోలాటాలు .స్వామి అమ్మవారి వేషధారణలు.ఇలా ఆధ్యాత్మికం ఉట్టిపడేలా గిరిప్రదిక్షణ ఉత్సవంలోలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు .దారిపొడుగునా దేవస్థానం ఆధ్వర్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలు పంపిణీ జరిగింది . పెద్దాపురం డివిజన్ పోలీస్ పర్యవేక్షణలో అన్నవరం బెండపూడి జాతీయ రహదారి మీదుగా పంపానది తీరం వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్లు మేర ఈ గిరి ప్రదర్శన జరిగింది.