YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాషాయ బంధం కోసం తహతహ

కాషాయ బంధం కోసం తహతహ

కాషాయ బంధం కోసం తహతహ
గుంటూరు, 
అమ్మాయికి లవ్ లోకి దింపాలంటే ముందు వన్ సైడ్ లవ్ తోనే కధ మొదలుపెట్టాలి. ఆమె నో అంటున్నా చీ అంటున్నా కూడా పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా ప్రేమ మంత్రం పఠిస్తూనే పోవాలి. చివరికి విసుగుతోనైనా మాట కలుపుతుంది. అది చాలు అనుభవం కలిగిన వాడు ముగ్గులోకి దింపేయడానికి. ఇపుడు ఏపీలోనూ అలాంటి రొమాంటిక్ స్టోరీయే సాగుతోంది. దాసుని తప్పులు దండంతో సరి అంటూ బీజేపీని వేడుకొంటున్న కృష్ణ పరమాత్ముడిగా చంద్రబాబు సీన్లో కనిపిస్తున్నారు.డోర్లు క్లోజ్ చేసేశాం అంటూ ఏపీకి వచ్చిన ప్రతీసారి రామ్ మాధవ్ లాంటి బీజేపీ అగ్ర నేతలు రివర్స్ గేర్ వేస్తున్నా కూడా సైకిల్ పరుగు ఆగడంలేదు. కమలం చుట్టూ తిరుగుతూనే ఉంది. ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చాయి. ఆ మరుసటి నిముషం నుంచే కాషాయ బంధం వేసుకోవాలని బాబు గట్టిగా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఏపీలో ఆగర్భ శత్రువు జగన్ అధికారంలో ఉన్నారు. తెలంగాణాలో గురువుని మించిన శిష్యుడు కేసీఆర్ ముఖ్యమంత్రి. కేంద్రంలో తాను పడి పడి విమర్శలు చేసిన మోడీ ప్రధానిగా రెండవమారు గెలిచారు. దాంతో నాటి నుంచి ప్రేమ విత్తనం వేస్తే అది ఈ రోజుకు చంద్రబాబు చేతిలో ప్రేమ లేఖగా మారింది.చంద్రబాబు ఏపీలో ఇసుక దీక్ష కోసం బీజేపీని మద్దతు అడిగారు. నిజానికి చంద్రబాబు కు ఎవరి మద్దతూ అవసరం లేదు. ఇలాంటి దీక్షలు వందలు వేలు చేయగల దీక్షాదక్షుడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ లాంటి కొత్త పూజారికి బలం చాలక అన్ని పార్టీలకు ఫోన్లు చేసుకున్నారంటే అర్ధం ఉంది. ఏకంగా మోడీ మీద ఢిల్లీకి వెళ్ళి ధర్మ పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన చంద్రబాబు కు బీజేపీ మద్దతు ఎందుకు. అదీ ఏపీలో నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చిన బీజేపీ మద్దతు కోసం చంద్రబాబు ఎందుకు ఈ పాట్లు. అంటే ఇక్కడే విషయం ఫుల్ క్లారిటీగా ఉంది. మద్దతు అన్నది ఒక సాకు, అది ఒక కారణం. ఇపుడు బీజేపీ మనసు తెలుసుకోవడమే చంద్రబాబు లాంటి అపర చాణక్యుడి లోతైన ఆలోచనగా చెబుతున్నారు. మద్దతుకు బీజేపీ ఓకే అంటే చాలు ఇక చంద్రబాబు మళ్ళీ ఢిల్లీ విమానం ఎక్కేస్తారు. కమలంతో కరచాలనం అయిపోయినట్లేనని అనుకూల మీడియా కూడా వండి వార్చేస్తుంది. ఒక వేళ లేదు అన్నా కూడా చంద్రబాబు లవ్ లెటర్ ఇచ్చారు కదా రేపైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటారు. ఈ రకమైన స్ట్రాటజీతో బీజేపీ మద్దతు కావాలి అంటున్నారు చంద్రబాబు .ఇక చంద్రబాబుతో మళ్ళీ దోస్తీ కట్టాలని బీజేపీలో ఓ వర్గం గట్టిగానే చెబుతోంది. వారంతా గతంలో చంద్రబాబు కు మద్దతుగా ఉన్న వారే. కనా లక్ష్మీ నారాయణ జమానా వచ్చాక రెండవ వర్గం జోరు పెరిగింది.ఇపుడు కన్నా, మాజీ టీడీపీ నేత సుజనా చౌదరి భాయ్ భాయ్ అంటున్న నేపధ్యంలో సోము వీర్రాజు లాంటి వారు చంద్రబాబు తో పొత్తుల్లేవంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీ బీజేపీకి ఈ విషయంలో సరైన క్లారిటీ లేదన్న మాట కూడా ఉంది. అసలు కధ అంతా ఢిల్లీ నుంచే నడుపుతూంటే లోకల్ బీజేపీ నేతలకు ఎంతవరకూ అధికారం ఉందన్న ప్రశ్న కూడా వస్తోంది. చంద్రబాబు మాత్రం ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణతో మద్దతు రాయబేరాలు నడుతునే ఢిల్లీలోనూ నరుక్కువస్తున్నారు. బీజేపీ మీట ఎక్కడ ఉందో తెలియని వారు కాదు చంద్రబాబు. ఏది ఏమైనా ఏపీలో బీజేపీని తన వెంట తీసుకెళ్ళడం బాబుకు పెద్ద కష్టమేనీ కాదని తమ్ముళ్ళు నిబ్బరంగా చెబుతున్నారు. అయితే కేంద్ర రాజకీయాల్లో మోడీ, అమిత్ షా నిర్ణయమే ఫైనల్, వారు కనుక జగన్ మీద మూడో కన్ను తెరవాలనుకుంటే మాత్రం చంద్రబాబు తో షేక్ హ్యాండ్ కి రెడీ అంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts