YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

 ఇంటర్ తో కౌశల్ ట్రైనింగ్

 ఇంటర్ తో కౌశల్ ట్రైనింగ్

 ఇంటర్ తో కౌశల్ ట్రైనింగ్
హైద్రాబాద్, నవంబర్ 13
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మొదలుకానుంది. ‘ప్రధాన మంత్రి కౌశల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజన (పీఎంకేవీవై)’ పథకం కింద పది జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలను ఎంపిక చేసిన సర్కారు.. పలు కోర్సుల్లో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలైంది.ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాస్/ ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  స్టూడెంట్లు చాలా మంది ఉపాధి అవకాశాల్లేక ఖాళీగా ఉంటున్నారు. అలాంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పీఎంకేవీవై పథకాన్ని ఉపయోగించుకోవాలని ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు భావించింది. ఈ మేరకు భాగంగా రాష్ట్రంలోని గద్వాల బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ, మత్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(నారాయణపేట), జనగామ గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జగిత్యాల), ములుగు, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెబ్బెన (ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), పెద్దపల్లి, బాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడ గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుమా బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలను ఎంపిక చేసింది. డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యోగా, ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డొమెస్టిక్ సల్యూవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టైలరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గార్డెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తదితర విభాగాల్లో జాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కోసం యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పది కాలేజీల్లో కలిపి మొత్తం రెండువేల మందికి అవకాశం కల్పించనున్నారు. రెండు, మూడు నెలల పాటు సాగే ఈ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసిన వారిలో 70 శాతం మందికి ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. శిక్షణా కేంద్రం నిర్వహించినందుకు ఒక్కో కాలేజీకి రూ.లక్ష మేరకు నిధులు అందనున్నాయి. ఈ నెలాఖర్లోగా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభమవుతుందని ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జలీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

Related Posts