ఇసుక ధరలు పెరుగుతున్నాయ్
మెదక్, నవంబర్ 13,
సిద్దిపేట జిల్లాలో ఆరు వేలకు చేరిన ట్రాక్టర్ ఇసుక ధర అక్రమ రవాణాపై పోలీసుల దృష్టి సిద్దిపేట, వెలుగు: ఇసుక ధర రోజురోజుకూ పెరుగుతోం ది. సిద్ది పేట జిల్లా లో నిర్మాణాలకు సరిపడా దొరకడం లేదు. కొరత ఎక్కువై నిర్మాణ రంగం కుదేలవుతోం ది. పోలీసులుఅక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తుం డటంతో ధర విపరీతంగా పెరుగుతోం ది. సిద్ది పేట, దుబ్బాక, చేర్యాల పట్టణాలతో పాటు వాటి చుట్టు పక్క గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలు జరుగుతుండగా వీటి అవసరాలకు సరిపోను ఇసుక అందడం లేదు. రెండు నెలల క్రితం టన్నుకు రూ.1200 పలికిన ధర ఇప్పుడు రూ.2 వేలకు చేరిం ది. ట్రాక్టర్ ఇసుక 6వేల రూపాయల వరకు ధర పలుకుతోం ది. దీంతో మధ్యతరగతి గృహ నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. సిద్ది పేట పరిసర ప్రాంతాలకు ఎక్కువగా కరీం నగర్ జిల్లా మల్లా రం, గన్నేరువరం, సిరిసిల్ల నుం చి ఇసుక రవాణా జరిగేది. కానీ ఇటీవల సరఫరా పూర్తిగా ఆగిపోయిం ది. లారీ యజమానులు ఎక్కువ ధర లభిస్తుం దని ఇసుకను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.వర్షా లు కురియడంతో వాగులు పొంగి కొం త మేర ఇసుక రవాణాకు ఆటంకం కలిగింది.ఇప్పటివరకు పరిస్థితి చక్కబడకపోవడంతో సమస్య మరిం త పెద్దదవుతోం ది.నేరుగా హైదరాబాద్ ..గోదావరి నది నుం చి అనుమతులతో ఇసుకను తెచ్చే లారీ యజమానులు నేరుగా హైదరాబాద్ కు తరలిం చి అధిక ధరలకు అమ్ముతు న్నారు. దీంతో కృత్రిమ కొరత ఏర్పడిం ది. స్థా నికంగా ట్రాక్టర్లలో సరఫరా చేసే ఇసుక అధిక ధరలకు లభిస్తుం డటంతో నిర్మాణదారులపై భారం పడుతోం ది. పోలీసులు అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తుం డటంతో చాటుగా రవాణా చేస్తున్న వారు అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుం టున్నారు. దీంతో ఇండ్లు కట్టుకుం టున్న మధ్యతరగతి ప్రజలు సతమతమవుతున్నారు. సిరిసిల్ల వాగు నుం చి రాత్రివేళల్లో ట్రాక్టర్లలో ఇసుకను తెచ్చేవారు. కానీ పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో ఇప్పుడు అక్కడ అక్రమ రవాణా బంద్ అయిం ది. పోలీసులు సీజ్ చేసిన ఇసుకను డీడీలు చెల్లిం చి ప్రభుత్వ నిర్మాణాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో టన్నుకు రూ.3 వేల నుం చి రూ.3500 లభిస్తుం డటంతో అక్కడికి తరలించేం దుకు లారీ యజమానులు ఆసక్తి చూపుతున్నారు. ఆన్ లైన్ బుకిం గ్ ఆర్డర్లు పొందే విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని లారీల యజమానులు పేర్కొం టున్నారు.