YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

బుగ్గ తండాలో లింగేశ్వర స్వామి ఉత్సవాలు రంగారెడ్డి

బుగ్గ తండాలో లింగేశ్వర స్వామి ఉత్సవాలు రంగారెడ్డి

బుగ్గ తండాలో లింగేశ్వర స్వామి ఉత్సవాలు
రంగారెడ్డి నవంబర్ 13,
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అరుట్ల అనుబంధ గ్రామమైన బుగ్గతండా సమీపంలో బుగ్గజాతర భక్తులు పోటెత్తారు. ఎంతో చరిత్రాత్మక మైన,విశిష్టత గల శ్రీ బుగ్గరమలింగేశ్వర స్వామి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి .1ఈ నెల 12 నుండి 26 వ తేదీవరకు పున్నమి నుండి అమావాస్య వరకు15 రోజులపాటు కొనసాగుతాయి. ఈ దేవాలయం చాలా పురాతనమైన ది రాచకొండ  రాజ్యాన్ని పాలించిన రేచర్ల పద్మనాయక వంశస్తుడైన సింగ భూపాలుడు కాలం నాటిదని చరిత్ర చెబుతోంది. ఊరికి దూరంగా పంట పొలాలనుండి ఆహ్లాదకరంగా ఈ దేవాలయం నెలకొంది .ఇక్కడ విషష్ఠత ఏమిటి అంటే తూర్పు నుండి పడమర వైపుకు ప్రహవహిస్తూ దక్షిణ వైపు సెలయేరు ప్రవహిస్తోంది ఈ సెలయేటి లో వెలసిన బుగ్గరమలింగేశ్వర స్వామి భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తుంది. సెలయేటి లో స్నానం చేస్తే పాపాలు పోయి పుణ్యం వస్తున్నదని భక్తుల నమ్మకం.పక్కనే ఉన్న గుట్టపైన కబీర్ దాస్ గుడి ఉంది ఇక్కడ ఆయన స్వామి వారిని కొలిచి అక్కడే కుటీరని ఏర్పాటు చేసుకొని అక్కడే సమాధి అయ్యేడు తెలంగాణ లో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ మహబూబ్నగర్, వరంగల్, హైదరాబాద్ జిల్లాను0డి భక్తులు వస్తుంటారు.వచ్చే వారికోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాట్ల చేశారు.భక్తులకు సోలాభ్యం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

Related Posts