సేఫ్ రిటర్న్ గా గోల్డ్
హైద్రాబాద్, నవంబర్ 14
టైల్ ఇన్వెస్టర్లు, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టయిల్ కన్జూమర్లలో మెజార్టీ సభ్యులు కరెన్సీల కంటే గోల్డ్‌నే ఎక్కువగా నమ్ముతున్నట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. ఇండియాలో 75 శాతం ఇన్వెస్టర్లు కరెన్సీల కంటే గోల్డ్‌నే ఎక్కువగా నమ్ముతున్నారని పేర్కొంది. అలాగే చైనాలో 69 శాతం మంది, అమెరికాలో 60 శాతం మంది, జర్మనీలో 57 శాతం మందిని గోల్డ్‌పైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నారని చెప్పింది. గోల్డ్ సేఫ్టీని, సెక్యురిటీని క్రియేట్ చేస్తోందని, ఇందుకే రిటైల్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొంటుందని డబ్ల్యూజీసీ చెప్పింది. వీళ్లలో 51 శాతం రిటైల్ ఇన్వెస్టర్లు గోల్డ్‌ను తమకు అదృష్ట దేవతగా కూడా భావిస్తున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18 వేల మందిపై డబ్ల్యూజీసీ ఈ సర్వే చేపట్టింది. గ్లోబల్‌గా ఉన్న 61 శాతం రిటైల్ ఇన్వెస్టర్లు కరెన్సీల కంటే ఎక్కువగా గోల్డ్‌పైనే నమ్మకం ఉంచుతున్నట్టు వెల్లడించింది. గోల్డ్ లాంగ్ టర్మ్ రిటర్నులను అందిస్తుందని, అందుకే ఎక్కువగా బంగారాన్ని కొంటున్నారని తెలిపింది. జువెల్లరీ కొనుగోలుదారులైతే, సెంటిమెంట్ ప్రకారం దీన్ని కొనుగోలు చేస్తున్నారని డబ్ల్యూజీసీ చెప్పింది. ఈతరం వారు కూడా గోల్డ్‌పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొంది. గత ఏడాది కాలంలో 18 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య ఉన్న 34 శాతం మంది బంగారంపై పెట్టుబడి పెట్టినట్టు డబ్ల్యూజీసీ రిపోర్ట్ తెలిపింది. గత ఏడాది కాలంగా గ్లోబల్‌గా 26 శాతం మంది యువత బంగార ఆభరణాలను కొనుగోలు చేశారు. అంతకుముందు ఏడాది ఇది కేవలం 18 శాతం మాత్రమే ఉండేదిప్రజల ఆదాయం పెరుగుతున్నా కొద్దీ.. గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతుంది. అన్ని మార్కెట్లలోని రిటైల్ ఇన్వెస్టర్లు, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టయిల్ కన్జూమర్లకు కూడా ఇదే వర్తిస్తుందని డబ్ల్యూజీసీ తెలిపింది. 44 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ను డైవర్సిఫై చేసుకునేందుకు గోల్డ్‌ను కొన్నారని, 31 శాతం మంది ఫైనాన్సియల్ అడ్వయిజర్ లేదా స్నేహితుడి రికమండేషన్‌పై కొనుగోలు చేశారని, 29 శాతం మంది ధర తక్కువగా ఉన్న కారణంతో కొన్నారని డబ్ల్యూజీసీ తన విశ్లేషణలో పేర్కొంది. బంగారపు ఆభరణాలను మాత్రం ఎమోషనల్ మొమెంట్స్‌లో కొనుగోలు చేస్తున్నారని చెప్పింది. పెళ్లి వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, వాలెంటైన్స్ డే, ఫెస్టివల్స్ వంటి సందర్భాల్లో గోల్డ్ జువెల్లరీకి ఎక్కువగా డిమాండ్ ఉంటున్నట్టు పేర్కొంది. జువెల్లరీ కొనుగోళ్లకు చైనాలో వార్షికోత్సవాలు టాప్‌లో నిలువగా.. ఇండియాలో పెళ్లి వేడుకలు, వార్షికోత్సవాలు టాప్‌లో ఉన్నాయి.ఇప్పటికే గోల్డ్‌లో పెట్టుబడి పెట్టిన వారిలో గ్లోబల్‌గా 64 శాతం మంది, ఇండియాలో 67 శాతం మంది మళ్లీ, గోల్డ్ జువెల్లరీ, బార్స్, కాయిన్స్, ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు గోల్డ్‌ను కొనని 29 శాతం మంది కూడా, ఫ్యూచర్‌లో బంగారం కొంటామని చెబుతున్నారు. మార్కెట్ పెరగడానికి చాలా అవకాశాలున్నాయని డబ్ల్యూజీసీ చెప్పింది. ఇండియాలో కేవలం 4 శాతం మంది మాత్రమే గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి అంత ఆసక్తి చూపడం లేదు. గ్లోబల్‌గా గోల్డ్ రేట్లు తగ్గుతుండటంతో, ఇండియాలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. సెప్టెంబర్‌లో రూ.40 వేల మార్క్‌ను తాకినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.2,300 తగ్గింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు 0.04 శాతం తగ్గి రూ.37,671గా నమోదయ్యాయి. ఎంసీఎక్స్ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ధరలు తగ్గుతుండటంతో, ఇండియాలో రిటైల్ డిమాండ్‌కు కాస్త బూస్టప్ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.