YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

విజయం ఆర్టీసీ కార్మికులదే - మంద కృష్ణ మాదిగ

విజయం ఆర్టీసీ కార్మికులదే - మంద కృష్ణ మాదిగ

విజయం ఆర్టీసీ కార్మికులదే - మంద కృష్ణ మాదిగ
గద్వాల
 కేసిఆర్ మాటలకు లెక్క చేయకుండా యుద్దంలో దిగిన ఆర్టీసి కార్మికలదే అంతిమ విజయం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం 40 రోజులుగా సమ్మె చేస్తున్న గద్వాల ఆర్టీసీ డిపో కార్మికులకు మద్దతుగా ఆయన సంఘీభావం తెలుపారు. గద్వాల ఆర్టీసి డిపో నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు కార్మికులు ఆధ్వర్యంలో ర్యాలి నిర్వహించారు. అనంతరం సమ్మె శిబిరంలో ఆయన ప్రసంగించారు.ప్రభుత్వ యంత్రాంగాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని కోర్టు బోనులో నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీకే దక్కుతుందని అన్నారు.   పౌర సమాజం, రాజకీయ పార్టీలు, న్యాయస్థానం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్నాయన్నారు. ఆర్టీసి కార్మికులు సమ్మె దిగినపడు ఒంటరి వారు.... కాని నేడు సమస్త సమాజం ఆర్టీసికి అండగా ఉంది. మీ పట్టుదల, సాహసం, సంకల్పమే ఇంత దూరం తీసుకవచ్చింది. ఆర్టీసి కార్మికులకు మద్దతు పెరిగే కొద్ది ఆయన ఓడిపోతున్నారు. మీరు గెలుస్తున్నారు. కేసిఆర్ స్వార్థం,  నియంతృత్వమే ఆయన పతనానికి నాంది పలుకుతుందన్నారు.
ప్రజలకు, రాజకీయపార్టీలకు, ఒంటరి చేసి సమ్మెను విచ్చినం చేయడానికి కేసిఆర్ అనెక కుట్రలు పన్నిండు. తెలంగాణ ఉద్యమంలో చివరిపాలకుడు కిరణ్ కుమార్రెడ్డి ఉద్యమకారులను చంపడానికి కుట్రలు చేయలేకపోయాడని అయన అన్నారు. ఆనాడు ఉద్యమకారుల రెచ్చిపోయి ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను ద్వంసం చేసిన కూడా కిరణ్ కుమార్రెడ్డి ఏమి చేయలేకపోయాడు. స్వరాష్ట్రంలో కేసిఆర్ పోలీసులకు సర్వాధికారులు ఇచ్చి  కార్మికులపై లాఠీచార్జీ,  చంపడానికి ప్రయత్నం చేసాడని ఆరోపించారు. ఆర్టీసి ఆస్తులను అమ్ముకోవడానికి కేసిఆర్ చూస్తుండు. ఆర్టీసి ఆస్తులను కాపాడుకోవడానికి కార్మికులు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలవాలని కోరారు.

Related Posts