తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
హైదరాబాద్
చిన్నంబావి మండలం లోని శ్రీశైలం ముంపు గ్రామాలలో కొన్ని ఇండ్ల పైకప్పులు శిథిలావస్థలో ఉన్నాయని వాటికి కొత్తగా పైకప్పులు వేసుకోవడానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్ వెంటనే వాటి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం మరిన్ని నిధులు ఇవ్వాల్సిందిగా మంత్రి ని ఎమ్మెల్యే కోరారు .మున్సిపాలిటీ ని అభివృద్ధి చేసేందుకు నిధులు సమకూరుస్తామని మంత్రి హామీనిచ్చారు.