YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

భారత్‌లో ‘నో మనీ ఫర్ టెర్రర్’ మీద అంతర్జాతీయ సదస్సు: కిషన్‌రెడ్డి

భారత్‌లో ‘నో మనీ ఫర్ టెర్రర్’ మీద అంతర్జాతీయ సదస్సు: కిషన్‌రెడ్డి

భారత్‌లో ‘నో మనీ ఫర్ టెర్రర్’ మీద అంతర్జాతీయ సదస్సు: కిషన్‌రెడ్డి
విశాఖపట్నం 
వచ్చే ఏడాది భారత్‌లో ‘నో మనీ ఫర్ టెర్రర్’ మీద అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... ‘ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకూడదు’ అనే నినాదంతో మెల్‌బోర్న్‌లో సమావేశం జరిగిందని తెలిపారు. 71 దేశాలకు చెందిన అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ సమావేశాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే విధంగా ఉగ్రవాదులకు సహాయం చేసే బ్యాంకులేవైనా సరే వాటిపై చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ హోం మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే.మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సివచ్చింది. బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించి శివసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే శివసేన మోసం చేసింది. నిజానికి బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసి ఉంటే అత్యధిక స్థానాల్లో గెలిచి ఉండేది’ అని కిషన్‌రెడ్డి మహా రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ‘స్కూళ్ళు తెరిచాం, పర్యాటకులను అనుమతించాం. 90 శాతం జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కేవలం18 పోలీసు స్టేషన్ల పరిధిలో ఉద్రిక్త వాతావరణం ఉంద’ని చెప్పారు.

Related Posts