YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అరవై ఏండ్ల ఇబ్బందులను తొలగించడమే నా ప్రదాన ఎజెండా

అరవై ఏండ్ల ఇబ్బందులను తొలగించడమే నా ప్రదాన ఎజెండా

అరవై ఏండ్ల ఇబ్బందులను తొలగించడమే నా ప్రదాన ఎజెండా
మేయర్ గా నా తొలి ప్రతిపాదన అండర్ బ్రిడ్జ్ పైనే చేసా...
గిరాకీ లేని నాయకులు అవాకులు చెవాకులు పేల్చుతున్నారు.....
శాశ్వత పరిష్కారం కోసమే పనిచేస్తున్నాం...
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్...
వరంగల్ 
గత 60 సంవత్సరాలలో అండర్ బ్రిడ్జ్ వెడల్పు గురించి పట్టించుకున్న నాయకుడు గానీ, రాజకీయపార్టీ గానీ ఏది లేదని, 2016 మార్చిలో నేను మేయర్ అయిన తర్వాత మొట్ట మొదటి ప్రతిపాదన అండర్ బ్రిడ్జ్ పై చేయటం జరిగిందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు.  బుధవారం వరంగల్ అండర్ బ్రిడ్జి  పనులను  ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుని వేగంగా పనులు చేయాలని,దీర్ఘకాలిక పరిష్కారం,ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాత్లాడుతూ నాడు మంత్రిగా హరీశ్ రావు దీనికి శంకుస్థాపన చేయడం జరిగిందని, ఆనాటి సభలో కూడా నా మొట్టమొదటి సంతకం అండర్ బ్రిడ్జ్ వెడల్పు పై పెట్టడం జరిగిందని చెప్పినట్లు గుర్తు చేశారు. కొంత మంది గిరాకీ లేని నాయకులు అవాస్తవాలను ముందరేసుకుని రాద్దాంతాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దసరా ముందే పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసామని కానీ పండుగ నేపద్యంలో ఆడభిడ్డలు బతుకమ్మ ఆట,లేదా వారి వారి ఊర్లకు వెల్లడంలో  ఇబ్బంది దృష్ట్యా తాత్కాలికంగా ఆపి ఇప్పుడు పునఃప్రారంభించడం జరిగిందన్నారు. పనుల ఆలస్యానికి కూడా కారణం అవతల వెంట్ నిర్మాణంలో ఉండటం,  అది పూర్తి స్థాయిలో పూర్తయ్యాకే దీన్ని మొదలు పెట్టాలనే ఇంజనీర్ల సూచనతో ఆలస్యమైందని పేర్కొన్న ఆయన రైల్వే పర్మీషన్ కూడా ఇంకా రాలేదని వారం రోజుల్లో అది కూడా క్లియరెన్స్ అవుతుందన్నారు. పని చేయాలంటే చిత్తశుద్ది కావాలని కొందరు ఎవరికి తోచినట్టు వారు ఆనాలోచితంగా విమర్శలు చేస్తూ,సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ సంతృప్తి పొందుతున్నారే తప్ప ఈ ప్రాంతానికి జరిగే దీర్ఘకాళిక ఉపయోగాన్ని మరుస్తున్నారని విమర్శించారు. 15రోజులలో వెంట్ పుష్ అప్ పూర్తి అవుతుందని, తర్వాత డ్రైన్ సిస్టం పూర్తి చేసి వర్షం వస్తే నీరు 15నిమిషాల్లో క్లియర్ అయ్యే విదంగా డ్రైనేజ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 
గేటు ఇవతల ప్రాంత ప్రజలు గత డెబ్బై ఏండ్లుగా పడుతున్న ఇబ్బందుల నుండి శాశ్వత విముక్తి కలిగించడం కోసం ఈ ఒక్క వెంట్ మాత్రమే కాకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొన్న హైదరాబాద్ లో జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో మరో వెంట్ కు ప్రతిపాదన చేయడం జరిగిందని తెలిపారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని, పుట్ ఓవర్ బ్రిడ్జ్ ,ఉన్న వెంట్ ను పూర్తి చేయడం మరోవైపు అదనంగా వెంట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అతి త్వరలో 220 కోట్లతో ఇంటర్నల్ రింగ్ రోడ్ గేటు ఇవతల ప్రాంతం నుండే ఏర్పాటు కాబోతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ లు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టారని, మంత్రి ఎర్రబెల్లి అన్ని విధాల సకరిస్తున్నారని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ తూర్పు నియోజకవర్గాన్ని అద్బుతంగా అభివృద్ది చేస్తానని నన్నపనేని నరేందర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ శామంతుల ఉషశ్రీ శ్రీనివాస్, కుడా అడ్వైజరీ మెంబర్ మోడెం ప్రవీణ్, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు..

Related Posts