YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు ఆరోపణలు నిరూపించాలి

చంద్రబాబు ఆరోపణలు నిరూపించాలి

చంద్రబాబు ఆరోపణలు నిరూపించాలి
తాడేపల్లి 
ఇసుక కొరతకు స్వయంగా కారకుడై ఉండి ఇసుకపై చంద్రబాబు దీక్ష చేయడం విడ్డూరమని వైకాపా అధికారప్రతినిధి,పెనమలూరు ఎంఎల్ ఏ కొలుసు పార్ధసారధి ఎద్దేవా చేసారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. ఇసుక కొరత తీరిపోయిందని తెలిసినా కేవలం రాజకీయప్రయోజనాల కోసమే దీక్ష. తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని అన్నారు. 
చంద్రబాబు సాయంత్రంలోపు నాపై చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపాలి. నేను ఎక్కడ ఇసుకను దాచాను,ఏం పనులు చేశాను,కృత్రిమ కొరత సృష్టించాను అనే వాటిని నిరూపించాలి. లేదంటే చంద్రబాబు దీక్ష చేస్తున్న ధర్నా చౌక్ లోనే నేను ధర్నా చేస్తాను.ఇందుకోసం విజయవాడ పోలీస్ కమీషనర్ కు దరఖాస్తు చేయబోతున్నానని అయన వెల్లడించారు. -ఇసుకను దోచేసిన టిడిపినేతలు మాపై ఆరోపణలు చేస్తారా. నీవు, నీ లోకేష్ లక్షలకోట్ల అవినీతిని బయటపడకూడదనే ఉధ్దేశ్యంతో ఇసుకను మీ ఎంఎల్ ఏలకు దోచేసుకోమని ఇసుకరీచ్ లను అప్పగించావని మండిపడ్డారు. నీ అండతో నాటి టిడిపి ఎంఎల్ ఏలు, టిడిపి నేతలు ఇసుక టన్నుల కొద్ది డంప్ చేసిన మాట వాస్తవం కాదా. వ్యవస్దలను నాశనం చేసి అవినీతికి పట్టం కట్టిన చరిత్ర చంద్రబాబుది. తన తాబేదారు పవన కల్యాణ తో కలసి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.  కృష్ణా,గోదావరి నదుల వరదతో ఇసుక కొరత ఏర్పడిన మాట వాస్తవం కాదా. చంద్రబాబు నివాసం పక్కనే ఇసుక అక్రమాలు తవ్వుతున్నప్పటికి చోద్యం చూసింది వాస్తవం కాదా. ఆ అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణం ప్రమాదంలో పడిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది వాస్తవం కాదాని అడిగారు. ఇసుక దోపిడీని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ఇసుక ఎంత కావాలంటే అంత ఇసుకను పారదర్శకంగా నేడు సరఫరా చేస్తున్నారు. ఇసుకను డంపింగ్ యార్డులకు తరలించి రాష్ర్ట ప్రజలందరికి అందుబాటులోకి తెచ్చారని అయన అన్నారు. 

Related Posts