ఎంపీడీవో తో ఎమ్మార్వో సహజీవనం
కర్నూలు, నవంబర్ 13,(న్యూస్ పల్స్)
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసినాబీ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. గత శుక్రవారం ఆమెపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఆమె పరారీలో ఉన్నారు. భూవివాదం పరిష్కారానికి తహసీల్దార్ రూ.4 లక్షలు డిమాండ్ చేయగా.. ఆమె బినామీ లంచం తీసుకుంటూ.. ఏసీబీ చేతికి చిక్కారు. ఏసీబీ అధికారులకు చిక్కకుండా హసినాబీ పారిపోవడానికి కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్య సహకరించారని వార్తలొస్తున్నాయి. హసినాబీ బినామీ ఏసీబీకి పట్టుబడిన నాటి నుంచి గిడ్డయ్య మెడికల్ లీవ్‌లో ఉండటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.దీంతో కర్నూలులోని ఎంపీడీవో గిడ్డయ్య క్వార్టర్స్‌లో కూడా ఏసీబీ సోదాలు చేపడుతోంది. తహసీల్దార్ హసినాబీ, ఎంపీడీవో గిడ్డయ్య సహజీవనం చేస్తున్నారని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. తహసీల్దార్ హసినాబీ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.కర్నూలులోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో హసినాబీ నివసిస్తోన్న సీ క్యాంప్‌లోని క్వార్టర్ నంబర్ 40లో తనిఖీలు చేపట్టగా.. కీలక ఆధారాలు లభించాయని సమాచారం