YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

హీరో రాజశేఖర్ కారులో బాటిల్స్

హీరో రాజశేఖర్ కారులో బాటిల్స్

హీరో రాజశేఖర్ కారులో బాటిల్స్
హైద్రాబాద్, నవంబర్ 13, 
హీరో రాజశేఖర్ డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బుధవారం (నవంబర్ 13) వేకువజామున 3 గంటల సమయంలో ఆయన రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండ‌గా ఔట‌ర్ రింగు రోడ్డుపై అప్పా జంక్షన్ వ‌ద్ద కారు ప్రమాదానికి గురైంది. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రాజశేఖర్ కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాదంలో రాజ‌శేఖ‌ర్ స్వల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.ప్రమాదం జరిగిన సమయంలో రాజశేఖర్ నడపుతున్న బెంజ్ కారు పరిమితికి మించిన వేగంతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. ఆ కారులో మద్యం బాటిళ్లు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం జ‌రిగిన కొద్ది సేప‌టికే పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. కారును స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కారులో మ‌ద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు.ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఓఆర్ఆర్‌పై గంటకు 100 కి.మీ.లకు తక్కువ వేగంతో వెళ్లాలనే పరిమితి ఉండగా.. ప్రమాద సమయంలో రాజశేఖర్ కారు 180 కి.మీ. వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. సదరు కారుపై ఓవర్ స్పీడ్‌కు సంబంధించి ఇప్పటికే మూడు చలానాలు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం బాటిళ్లను సాక్ష్యాలుగా సమర్పించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ప్రమాద సమయంలో కారులో తాను ఒక్కడే ఉన్నట్లు రాజశేఖర్ తెలిపారు. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డుపై గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులోని వారు ప్రమాదాన్ని గుర్తించి.. నా కారు దగ్గరకి వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్‌లో నుంచి బయటకు లాగారు’ అని రాజశేఖర్ తెలిపారు.‘వారి ఫోన్ తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాను. తర్వాత నా కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాను. అక్కడ నుంచి వారే నన్ను కారులో తీసుకెళ్లారు. మార్గమధ్యంలో జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురుగా వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎలాంటి గాయాలు కాలేదు’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.ఘటన జరిగిన వెంటనే వాహనంలోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో రాజశేఖర్‌కు ప్రమాదం తప్పింది. ఔటర్ రింగ్ రోడ్డుపై కారు పల్టీలు కొట్టి.. రహదారి పక్కకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయినా ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు
అతివేగమే కారణం హీరో రాజశేఖర్‌ కారు మంగళవారం అర్థరాత్రి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని పెద గోల్కొండ వద్ద కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. రామోజీ ఫిలిం సిటీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే కారు అధునాతన సెక్యూరిటీ సిస్టమ్ ఉన్న కారు కావటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ కావటం వల్ల రాజశేఖర్‌కు ఏమీ జరగలేదు. కారు ముందుగా భాగం పూర్తిగా నుజ్జు నుజ్జైన పరిస్థితి చూస్తుంటే ప్రమాద తీవ్రత అర్ధమవుతుంది.ప్రమాదం జరిగిన కారులో మధ్యం బాటిళ్లు, ప్లాస్టిక్‌గ్లాసు కూడా లభించినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు స్పందించారు. అతివేగం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా వెల్లడించారు. ప్రమాదంలో రాజశేఖర్‌ స్వల్పంగా గాయపడ్డారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రమాద సమయంలో కారు దాదాపు 150 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అంత వేగంగా కారు నడపటమే వల్లే యాక్సిడెంట్‌ జరిగిందని భావిస్తున్నారు.అంతేకాదు ప్రస్తుతం ప్రమాదానికి గురైన కారుపై మూడు పెండింగ్‌ చలాన్లు ఉన్నాయి. ఆ మూడు చలాన్లు కూడా అతి వేగం, ప్రమాదకర డ్రైవింగ్‌కు సంబంధించినవే. జూలై 31 సాయంత్ర సమయంలో రాచకొండ ప్రాంతంలో, తరువాత అక్టోబర్‌ 2 ఉదయం 11 గంటల సమయంలో రాజేంద్ర నగర్‌, చెన్నమ్మ హోటల్‌ ప్రాంతంలో అక్టోబర్‌ 18న మరోసారి అదే ప్రాంతంలో రాజశేఖర్‌ కారుకు పరిమితికి మంచి వేగంగా ప్రయానించినందుకు గాను చలాన్లు విధించారు. ఈ మూడు వైలేషన్స్‌కు సంబంధించిన మూడు వేల నూటా ఐదు రూపాయలు చలాన్లు ఇంకా కట్టాల్సి ఉంది.అంతేకాదు 2017 అక్టోబర్‌ 9న కూడా రాజశేఖర్‌ కారు ప్రమాదానికి గురైంది. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైపై రామి రెడ్డి అనే వ్యక్తి కారును రాజశేఖర్‌ ఢీ కొట్టారు. ఆ సమయంలో రాజశేఖర్‌ మధ్య సేవించి ఉన్నారని అందువల్లే ప్రమాదం జరిగిందని బాధితుడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్‌ నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌పరీక్షలో రాజశేఖర్‌ మధ్యం తీసుకోలేని కొన్ని మెడిసిన్స్‌ కారణంగా మత్తు వచ్చిందని వెల్లడించారు. ఆ సమయంలో తల్లి మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన రాజశేఖర్‌ కొత్త కాలం చికిత్స తీసుకున్నారు.

Related Posts