కోలుకుంటున్న లతా మంగేష్కర్
ముంబై, నవంబర్ 13,
భారత రత్న, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆమె శ్వాసతీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవ్వటంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. అయితే ఆసుపత్రిలో జాయిన్ అయ్యే సమయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలిసింది.దీంతో బాలీవుడ్ సినీ వర్గాలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి రాజీవ్ శుక్ల ఆమె ఆరోగ్యపరిస్థితిపై ట్వీట్ చేశారు. ఈ రోజు ఆసుపత్రిలో లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆయన ఆసుపత్రి వర్గాలు అడిగిన ఆమె హెల్త్ కండిషన్ గురించి తెలుసుకున్నారు. `లతాజీ కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ఆమె కోలుకుంటున్నారు. ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను` అంటూ ట్వీట్ చేశారు రాజీవ్ శుక్లా.ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ సమయంతో మాకు కాస్త ప్రైవసీ కావాలని కోరారు. లతాజీ చెస్ట్ ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరారరన్న కుటుంబ సభ్యులు ఆమె వైద్యానికి స్పందిస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లోనే ఆమెను ఇంటికి తీసుకెళ్తామని తెలిపారు.దాదాపు అన్ని భారతీయ భాషల్లోను పాటలు పాడారు లతా మంగేష్కర్. తన కెరీర్‌లో దాదాపు 25వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు లతా మంగేష్కర్. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. భారత దేశ అత్యున్నత పురస్కార భారత రత్న సైతం ఆమెను వరించింది.ఇప్పటికీ ఆమె పాటలకు ఎంతో ఆదరణ ఉంది. ప్రస్తుతం లత వయసు 90. కొంతకాంలగా సినీ నేప