సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
దేవరకొండ
నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలో ఉన్న నసర్లపల్లి లోని వేంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీలో సీసీఐ కేంద్రాన్ని దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ బుధవారం ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకొని పత్తికి మద్దతు ధరగా ఒక క్వింటాల్ కి 5500 రూపాయలు ప్రకటించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇప్పటికే కొంతమంది రైతులు మోసపోయిన సంఘటనలు చూస్తూనే ఉన్నాము. అయితే పత్తిని తేమ శాతం 12 కు తగ్గకుండా చూసుకోవాలని రైతులకు సూచించిన ఎమ్మెల్యే. గ్రామాల్లో పత్తి కొనుగోలు దళారులను నమ్మకుండా సీసీఐ కేంద్రలలో పత్తిని అమ్ముకుంటే మోసపోవాల్సిన అవసరం ఉండదని అన్నారు.. ఈ సీసీఐ కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో చింతపల్లి జడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి తో పాటు స్థానికి ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.